గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

0

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి
– గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
– కందుగుల ఉపసర్పంచ్ మండ సతీష్
హుజురాబాద్:
తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించాలని కందుగుల ఉపసర్పంచ్ మండ సతీష్ అన్నారు. సోమవారం మండలంలోని కందుగుల గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తల్లి పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయని, పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాల‌న్నారు. కనీసం ఆరు నెలలు బిడ్డకు తల్లిపాలు పట్టించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిపాల వల్ల చిన్నారుల్లో రోగ నిరోదక శక్తి పెరిగి ఆరోగ్యవంతులుగా ఎదుగుతారన్నారు. తల్లి పాలలో అనేక పోషకాలు, ఎంజైములు, హార్మోన్లు సమపాళ్లలో లభిస్తాయని తెలియజేశారు. 8 నెలలు నిండిన తర్వాత అదనపు ఆహారం అందిస్తూ 2 సంవత్సరాల వరకు తల్లి పాలు పట్టించాలన్నారు. చిన్నారులకు పోషక ఆహారాలను అందించాలని సూచించారు. అదే విధంగా బాలింతలు పసిపిల్లలకు పాలు ఇచ్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలి..
గర్బిణులు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని, జంక్‌ఫుడ్‌ తీసుకోవద్దన్నారు. తృణధాన్యాలైన కొర్రలు, సజ్జలను ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. సజ్జలు తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ పెరుగుతుందని తెలిపారు. అనంతరం చిన్నారులకు అన్న ప్రాశన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముప్పు మహేష్, పంచాయతీ కార్యదర్శి మధుకర్, అంగన్వాడి టీచర్ లు రజిత, పద్మ, ఏఎన్ఎం సైదాబాన్, ఆశా వర్కర్స్ సరూప, స్వప్న, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *