మోకాలు మార్పిడికి అత్యాధునిక రోబోటిక్ సర్జరీ…
యశోదాలో మోకాలు మార్పిడికి అత్యాధునిక రోబోటిక్ సర్జరీ…
కరీంనగర్:
యశోద ఆస్పత్రిలో మోకాలు మార్పిడికి అత్యాధునిక రోబోటిక్ ద్వారా సర్జరీ చేస్తున్నట్లు ప్రముఖ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ డాక్టర్ సునీల్ దాచేపల్లి అన్నారు. కరీంనగర్ లోని యశోద మెడికల్ సెంటర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యశోద ఆసుపత్రి సోమాజిగూడ లోని ప్రముఖ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ డాక్టర్ సునీల్ దాచేపల్లి మాట్లాడుతూ.. మోకాల అరుగుదల అనేది ప్రస్తుతం మధ్య వయసు నుండి వృద్ధుల వరకు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అన్నారు. దీనికి మొదటి రెండు దశలలో ఇంజక్షన్ తీసుకోవచ్చు కానీ ఆఖరి రెండు దశలలో మాత్రం మోకాలు మార్పిడి తప్పనిసరి అని పేర్కొన్నారు. దీనికి అత్యంత ఆధునిక టెక్నాలజీ అయినా రోబోటిక్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. మాన్యువల్ గా చేసే మోకాలు మార్పిడి చికిత్సలో శస్త్ర చికిత్సకు ఎక్కువ సమయం పడుతుందనీ రోగి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. రోబోటిక్ సర్జరీ ద్వారా అయితే ఖచ్చితమైన కొలతలతో ముందే నిర్ధారణ చేసుకుని ఆపరేషన్ చేయడం వల్ల సులభతరం అవుతుందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ ఇంప్లాంట్ అయినా ఆక్సినియం అనే పరికరం ఉపయోగించడం జరుగుతుందని, ఉదయం ఆపరేషన్ చేస్తే సాయంత్రానికల్లా నడుస్తారన్నారు. ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కరీంనగర్ కు చెందిన పేషంట్ జగదీష్ చంద్ర మాట్లాడుతూ… మూడు సంవత్సరాలుగా మోకాలు నొప్పితో బాధపడుతున్నానని అపరేషన్ చేయించుకోవడానికి చాలా భయపడేవాడిని రోబోటిక్ సర్జరీ ద్వారా సులభతరం అయిందని తెలిపారు. పేషంటు రాజయ్య మాట్లాడుతూ.. మోకాలు అరుగుదలకు ఆయుర్వేదం హోమియో అనేక ప్రయత్నాలు చేసి చివరికి రోబోటిక్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేసుకోవడం వల్ల ఇప్పుడు సాధారణంగా నడుస్తున్నానని డాక్టర్ల బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
