జీడి రవితేజను సన్మానించిన న్యాయవాదులు

4

జీడి రవితేజను సన్మానించిన న్యాయవాదులు
హుజురాబాద్:
వీణవంక మండలంలోని వల్బపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది జీడి రవితేజను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా నియమించడం పట్ల హుజురాబాద్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం న్యాయవాదుల ఆధ్వర్యంలో రవితేజను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు, రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గౌడ్ లకు రవితేజ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బత్తుల తిరుపతి, న్యాయవాదులు రుద్రారం రవీందర్, బోనగిరి శివరామకృష్ణ, మొలుగూరి విక్రమ్, హరిహరన్, మౌషం మౌనిక, హరికృష్ణ గౌడ్, మోరే కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *