ఉద్యోగ విరమణ సహజం..

0

ఉద్యోగ విరమణ సహజం..
. జ్యోతిరావు పూలే ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్
హుజురాబాద్:
ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజమని హుజురాబాద్ జ్యోతిరావు పూలే ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్ పేర్కొన్నారు. ములుగు జిల్లా రవాణా అధికారిగా విధులు నిర్వహించిన మహమ్మద్ సిరాజ్ ఉర్ రెహమాన్ పదవి విరమణ సందర్భంగా మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ.. రవాణా శాఖలో సిరాజ్ ఉర్ రెహమాన్ అందించిన సేవలను కొనియాడారు. హుజురాబాద్ లో సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. అనంతరం పూల మాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *