ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి..

0

ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి..
– జర్నలిజం విభాగధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్
హనుమకొండ:
సమాజంలో సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ ఎక్కువగా వస్తున్నదని, రిపోర్టర్లు ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండి వాస్తవాలను నిర్ధారించుకొని నిజమైన వార్తలను పాఠకులకు అందించాలని జర్నలిజం విభాగధిపతి డాక్టర్ సంగాని మల్లేశ్వర్ సూచించారు. ఆదివారం కాకతీయ విశ్వవిద్యాలయంలోని సిడిఓఈలో గల జర్నలిజం విభాగంలో ఫ్యాక్ట్ చెకింగ్ ఆఫ్ ఫేక్ న్యూస్ (తప్పుడు వార్తల పై వాస్తవ తనిఖీ) అనే అంశంపై సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఫేక్ న్యూస్ వల్ల ప్రభుత్వాలే మారుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ గోపగాని సప్తగిరి జర్నలిజం విద్యార్థులకు వాస్తవమైన వార్తను ఎలా గుర్తించాలో అవగాహన కల్పించారు. వెబ్ ప్రపంచాన్ని తప్పుడు సమాచారం ముంచెత్తి వేస్తోందని.. సమాజానికి ఇదో సవాల్ గా మారిందని గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ సప్తగిరి గోపగాని తెలిపారు. తప్పుడు వార్తలను నివారించడానికి గూగుల్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఫ్యాక్ట్ చెకింగ్ కి సంబంధించిన టూల్స్ వినియోగించుకోవడం ద్వారా సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్ ని అరికట్టవచ్చని సూచించారు. కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విద్యార్థులకు ఫ్యాక్ట్ చెకింగ్ పై సప్తగిరి అవగాహన కల్పించారు. ఫేక్ న్యూస్ కనిపెట్టడానికి.. వాటి మూలాలు కనుక్కోవడానికి అవసరమైన పలు టూల్స్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కంజర్ల నరసింహా రాములు, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ శంకర్, డాక్టర్ చిరంజీవి, జర్నలిజం మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *