బాపూజీ ఆశయాలు ప్రతి తరానికి దిక్సూచిగా మారాలి

0

బాపూజీ ఆశయాలు ప్రతి తరానికి దిక్సూచిగా మారాలి
– ఫూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్

హన్మకొండ:
ప్రజా జీవితం అంటే కేవలం పదవులు, అధికారాలు కాదు. ప్రజల కోసం నిలబడటం, అవసరమైనప్పుడు త్యాగం చేయడం, సామాజిక న్యాయం కోసం ప్రశ్నించడం, ఆత్మగౌరవాన్ని కాపాడటం అని చాటిన కొండా లక్ష్మణ్ బాపూజీ బహుజనలకు స్ఫూర్తిదాయకం అని పాస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ అన్నారు. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఫూలే ఆశయ సాధన సమితి (పాస్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాస్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఆయన చరిత్రను జయంతులు, వర్ధంతులకే పరిమితం చేయకుండా భవిష్యత్ తరాలకు సామాజిక బాధ్యతగా అందించాల్సిన అవసరం ఉందని కొనియాడారు. రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం మాటల్లో ఉండకూడదు. ప్రభుత్వ విధానాల్లో కనిపించాలని, విధానాల్లోనే కాదు.. వాటి ఫలితాల్లోనూ కనిపించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో పాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చందా మల్లయ్య, పాస్ జిల్లా నాయకులు డాక్టర్ రవీందర్, డాక్టర్ సుధాకర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *