ఆర్యవైశ్య వనభోజన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
నేడే ఆర్యవైశ్య వనభోజన మహోత్సవం..
– కేసీ క్యాంపులో ఘనంగా ఏర్పాట్లు
-హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని కేసి క్యాంపులో ఆదివారం జరిగే ఆర్యవైశ్య వనభోజన మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ పట్టణ, మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వనభోజన మహోత్సవం ఆగస్టు 03 ఆదివారం ఉదయం 8గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కేసి క్యాంప్‌లోని ఆర్యవైశ్య సదన్ వద్ద నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన, రాక్ ఆర్కెస్ట్రా, ఆటపాటలు, చిన్నపిల్లలకు గేమ్స్ వంటి వినోద కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు.
అల్పాహారం, భోజనం, సాయంత్రం స్నాక్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సర్వే, లక్కీ డ్రా బహుమతులు, మట్టి వినాయకుడు, పూల మొక్క పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర సభ్యత్వం కోసం రూ. 525 చెల్లించి ఓటు హక్కుతో సభ్యత్వం పొందవచ్చన్నారు. ఆర్యవైశ్య సభ్యులందరూ కుటుంబ సమేతంగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
