పట్టు పరిశ్రమ శాఖలో రషీద్ చేసిన సేవలు ఎనలేనివి
ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజం.!
– పట్టు పరిశ్రమ శాఖలో రషీద్ చేసిన సేవలు ఎనలేనివి
– ఘనంగా రషీద్ సన్మానోత్సవ కార్యక్రమం
– భీమదేవరపల్లి:
ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజమని విశ్రాంత సేరికల్చర్ అధికారి ఎంవిఆర్ రమేష్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి పదవి విరమణ చేయబోతున్న మహమ్మద్ రషీద్ పదవి విరమణ సన్మానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం హనుమకొండ జిల్లాలోని ముల్కనూర్ లో ఘనంగా నిర్వహించారు. ముందుగా మహమ్మద్ రషీద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సన్మానోత్సవ కార్యక్రమానికి రషీద్ చిన్ననాటి స్నేహితులు మిత్రులతో పాటు బంధువులు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రషిద్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ పొందేది ఉద్యోగానికి మాత్రమే సేవకు కాదన్నారు. జీవితాంతం పేదలకు సేవలందించాలన్నారు. ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. రషీద్ శేష జీవితాన్ని సుఖసంతోషాలతో గడపాలని కోరుతున్నామన్నారు. రైతులకు అవగాహన కల్పిస్తూ మల్బరి సాగుతో పాటు పట్టుపురుగుల పెంపకం చేపట్టే విధంగా మహమ్మద్ రషీద్ ఎంతో కృషి చేశారని, ఆయన పట్టు పరిశ్రమ శాఖలో చేసిన సేవలు ఎనలేనివన్నారు. రషిద్ విశ్రాంత జీవితాన్ని ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. అనంతరం రషీద్ మాట్లాడుతూ..1985 లో దినసరి కూలీగా చేరి 1989లో టెక్నికల్ అసిస్టెంట్ నుండి టెక్నికల్ అధికారిగా, అసిస్టెంట్ సెరికల్చర్ ఆఫీసర్, సెరికల్చర్ ఆఫీసర్ నుండి 2025 జనవరి లో కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ ఉద్యోగ పదోన్నతులు పొందానని తెలిపారు. ఈనెల 31న పదవి విరమణ ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెరికల్చర్ హన్మకొండ సూపరింటెండెంట్ రాజు, విశ్రాంత పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి, రాష్ట్ర నాయకులు రాజేష్ నాయక్, మిత్రులు నర్సయ్య, రాంబాబు, పంజాల దామోదర్, జున్నోజు భాస్కర్, రాజేందర్, సీనియర్ న్యాయవాది చల్ల శ్రీనివాస్, సదానందం తదితరులు పాల్గొన్నారు.
