భాషతో పాటు భావ వ్యక్తీకరణ ముఖ్యం…

0

భాషతో పాటు భావ వ్యక్తీకరణ ముఖ్యం…
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్:
విద్యార్థులకు భాషతోపాటు భావవ్యక్తీకరణ, విషయం పట్ల అవగాహన చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను టి.ఈ.డి ( టెక్నాలజీ ఎంటర్టైన్మెంట్ డిజైన్) “స్టూడెంట్స్ టాక్” కార్యక్రమానికి పంపేందుకు గాను పారమిత విద్యాసంస్థల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో ప్రభుత్వ విద్యార్థుల ఎంపిక కార్యక్రమం మంకమ్మతోటలోని ప్రభుత్వ (దనగర్వాడి) పాఠశాలలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో సంభాషించారు. తెలుగుతో పాటు ఆంగ్లభాష కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యమన్నారు. మన భావాలను సంస్కృతిని ప్రపంచం ముందుకు తీసుకువెళ్లేందుకు ఆంగ్లభాష తోడ్పడుతుందన్నారు. టీఈడీకి ఎంపిక కాకపోయినా విద్యార్థులు ఇప్పుడు నేర్చుకున్న విషయాలు వారికి జీవితంలో ఉపయోగపడతాయన్నారు. ఓటమితో నిరాశపడకుండా ప్రయత్నిస్తే విజయం తప్పక సాధిస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలిక ఎప్పటికైనా ప్రపంచ వేదికపై ఉపన్యాసం ఇవ్వాలని తన కోరికగా ఆకాంక్షించారు. ప్రపంచ స్థాయిలో విద్యార్థుల ఉపన్యాసానికి వేదికగా ఉన్న టీ.ఈ.డికి ఎంపిక కోసం మొట్ట మొదటిసారిగా కరీంనగర్ జిల్లా నుండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను పంపేందుకు ఈ ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు, మండల విద్యాధికారి అబ్దుల్ అజీమ్, సర్వ శిక్ష అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *