విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలి..

0

విద్యార్థులకు ఏ ఇబ్బంది రావద్దు..
. విధుల్లో అలసత్వం ప్రదర్శించవద్దు..
. హాస్టల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి..
. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలి..
. అత్యుత్తమ విద్యను బోధించాలి
. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్
. రాత్రివేళ..ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తనిఖీ
కరీంనగర్:
హాస్టల్ లో ఏ ఒక్క విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు, హాస్టల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆ విధానానికి సిబ్బంది స్వస్తి పలకాలని, హాస్టల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరీంనగర్ లోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను అదనపు కలెక్టర్ సోమవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది, విద్యార్థులతోనూ మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. హాస్టల్ వసతులు, విద్యా బోధన, వివిధ అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ హాస్టల్లోని సరుకులు, బియ్యము పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని సమయం ప్రకారం అందించాలని పేర్కొన్నారు. భోజనం విషయంలో గానీ, విద్యబ్యాసన విషయంలో గాని ఎక్కడా ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వవద్దని సూచించారు. చలికాలం నేపథ్యంలో విద్యార్థుల వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అత్యుత్తమైన విద్యను బోధించాలని, మంచి ఫలితాలు వచ్చేలా విద్యార్థులు తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ తెలిపారు. పలు అంశాలపై హాస్టల్ అధికారులు, సిబ్బంది విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *