కాకతీయ జూ పార్క్ లో విద్యార్థులకు ప్రతిభ పోటీలు

0

కాకతీయ జూ పార్క్ లో విద్యార్థులకు ప్రతిభ పోటీలు
-హన్మకొండ:
ఈ నెల 29 న, అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆదివారం కాకతీయ జూలాజికల్ పార్క్, హన్మకొండలో విద్యార్ధిని, విద్యార్థులకు జిల్లా అటవీ శాఖ మరియు వైల్డ్ లైఫ్ సొసైటీ (ఔల్స్) ఎన్.జీ.ఓ. సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభా పాఠవ పోటీలు నిర్వహించారు. ఇందులో 100 మందికి పైగా విద్యారినీ విద్యార్థులు పాల్గొని చిత్రలేఖనం, వ్యాసరచన మరియు వకృత్వ పోటీలలో ప్రతిభను కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, కన్సోలోషన్ బహుమతులు ఈ నెల 29 న జరుగనున్న అంతర్జాతీయ పులుల దినోత్సవం రోజున ముఖ్య అతిథులచే ఇవ్వనున్నారు. ఈ రోజు ఈ పోటీలకు హన్మకొండ ఫారెస్ట్ జూ ఎఫ్.బి.ఓ. శ్వేత, వైల్డ్ లైఫ్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఇందారం నాగేశ్వర్ రావు, ప్రముఖ పర్యావరణ వేత్త, ఔల్స్ సంయుక్త కార్యదర్శి పిట్టల రవిబాబు, వనసేవా సొసైటీ ఎన్జీవో కార్యదర్శి నరేష్, జూ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, తల్లితండ్రులు, మరియు తల్లితండ్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *