ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలి

0

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలి
– జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
-కరీంనగర్:
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. నగరంలోని మదీనా కాంప్లెక్స్ లో గల ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్ (రెవిన్యూ), అశ్విని తానాజీ వాకాడే (స్థానిక సంస్థలు), నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, డీఇఓ చైతన్య జైనీ ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *