ఘనంగా ఆర్యవైశ్య వనభోజన మహోత్సవం..

0

ఘనంగా ఆర్యవైశ్య వనభోజన మహోత్సవం..
– అట్టహాసంగా సాగిన కార్యక్రమం
– ఆకట్టుకున్న పోటీలు, నృత్యాలు
హుజురాబాద్:
హుజరాబాద్ పట్టణంలోని కేసి క్యాంపులో ఆర్యవైశ్య వనభోజన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఆదివారం కేసీ క్యాంపులోని వైశ్య సదన్ ప్రాంగణంలో అట్టహాసంగా నిర్వహించారు. పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల నుండి ఆర్యవైశ్యులంతా కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముందుగా వాసవి మాతకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రత్యేక వినోద కార్యక్రమాలను నిర్వహించారు. ఆటలు, పాటలు, నృత్యాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను, మొక్కలను పంపిణీ చేశారు. లక్కీ డిప్ లో భాగంగా విజేతలకు మూడు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని తాజా మాజీ మున్సిపల్ ఛైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు హరిశంకర్, కార్యదర్శి నూక శ్రీనివాస్, రేణుకుంట్ల సురేష్, ఆర్యవైశ్య సంఘం పట్టణాధ్యక్షుడు కొడిత్యాల నాగరాజు, వైశ్య సంఘం ప్రముఖులు నార్ల రాజేందర్, గర్రెపల్లి శ్రీనివాస్, చందా చంద్రగుప్త, నార్ల శ్రీనివాస్, అక్కినపల్లి అనిల్, కాపర్తి అనిల్, కొమురవెల్లి హరిప్రసాద్, నార్ల నారాయణ, ఉమాశంకర్, గంగిశెట్టి ప్రభాకర్, రామిడి మల్లేశం, అకిననపల్లి శ్రవణ్ తదితరుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *