హరీష్‌రావు కు శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ నేతలు

0

ఘనంగా హరీష్‌రావు జన్మదిన వేడుకలు
– హరీష్‌రావును కలిసి శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ నేతలు
హుజురాబాద్, జూన్ 4: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను హుజురాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. గురువారం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వర్ధినేని రవీందర్ రావు, పొనగంటి శ్రావణ్ కుమార్, కటుకూరి మల్లారెడ్డి తదితరులు హరీష్‌రావును స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కార్యరూపంలో చూపించిన నాయకుల్లో హరీష్‌రావు ఒకరని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే ప్రజానాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు ఆశయాల సాధనకు అంకితభావంతో పనిచేస్తున్న నిజమైన సైనికుడు హరీష్‌రావు అని అన్నారు. తెలంగాణ ప్రజల సేవలో ఆయన మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షు పొందాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా హరీష్‌రావుకు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *