మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

0

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం…
– ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్
– మరో 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీదే అధికారం
– మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి
– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ తుమ్మల నాగేశ్వరరావు
హుజురాబాద్:
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని డిసిఎంఎస్ కాంప్లెక్స్ లో జరిగిన కార్నర్ మీటింగ్లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ లతో కలసి హాజరై మాట్లాడారు. రాబోయే పది సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలన్నారు. పేదల, బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అందిస్తున్నామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందిస్తున్నామని, దీనికోసం సుమారు 13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలను విస్మరించిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసి ఐదు లక్షల రూపాయలు అందిస్తున్నదన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మించి నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఏం కావాలో అడిగి వారికి అవసరమైన హామీలు ఇవ్వాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారని, జిల్లా ఇన్చార్జి మంత్రిగా హుజరాబాద్ జమ్మికుంట ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆదరించి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది…
– రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఇతర పార్టీలకు ఓటు ఎందుకు వేయాలో అడగాలన్నారు. హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా గత ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చిందో.. ఇంతవరకు అమలు చేసిందో ప్రజలు ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎన్నికనే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు మొదటి పరీక్ష అని పేర్కొన్నారు హుజరాబాద్ లోని 30 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులు అధర్యపడవద్దని మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో మోసపోవద్దు…
– జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
హుజురాబాద్ ఎమ్మెల్యే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి మోసపోయారని, మళ్లీ ఆ పార్టీకి ఓటేసి మున్సిపల్ ఎన్నికల్లో మోసపోవద్దని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే హుజురాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా రీల్స్ తప్పా చేసిన అభివృద్ధి ఏంటి…
– కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆదరించి ఆశీర్వదించండి
– కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం తప్పా హుజురాబాద్ అభివృద్ధి కోసం ఏం చేశాడో ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నదన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని గుర్తు చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్కరికి 10 సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందించి సన్నబియ్యం ఇస్తున్నదన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి సుమారు 30 నుంచి 40 వేల వరకు సంవత్సరానికి ఆదా అవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు ఒక్కో మున్సిపాలిటీకి ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం మంజూరు చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో మోసపూరిత మాటలతో ఆగం కావద్దని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *