బిఆర్ఎస్ పార్టీతోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యం..

0

బిఆర్ఎస్ పార్టీతోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యం..
– 20 వార్డు అభ్యర్థి శ్రీదేవి ని భారీ మెజార్టీతో గెలిపించాలి
– ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి
– హుజరాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం
హుజురాబాద్:
బిఆర్ఎస్ పార్టీతోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి అన్నారు. శనివారం హుజరాబాద్ పట్టణంలోని వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోనే హుజురాబాద్ పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీల మోసపూరిత మాటలు నమ్మొద్దన్నారు. 20 వార్డును మరింత అభివృద్ధి చేయాలంటే బిఆర్ఎస్ అభ్యర్థి కొయ్యడ శ్రీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కానుగంటి శ్రీనివాస్, సతీష్, కోయడ కమలాకర్, వేణు తదితరులు పాల్గొన్నారు.
బిజెపి నుండి బీఆర్ఎస్ లో చేరిక..
సీనియర్ బిజెపి నాయకుడు తేలుకుంట వేణు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని ఆధ్వర్యంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వేణుకు బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యమని అందుకే బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *