మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

0

రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివి
– మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని
– ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
హుజురాబాద్:
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, ప్రతి ఒక్కరూ ఆయనను స్మరించుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని విశ్వసించిన రాజీవ్‌గాంధీ యువతకు ఎన్నో అవకాశాలు కల్పించారని అన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్య నిర్మాణంలో యువతకు కీలక పాత్ర కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. దేశంలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టిన దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. యువతకు అవకాశాలు కల్పించడం, గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఆయన విశేష కృషి చేశాడన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన పాత్ర చిరస్మరణీయమైందని అన్నారు. అలాగే ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని, యువత రాజీవ్ గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవస్థానం చైర్మన్ కొలిపాక శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొల్లురి కిరణ్, పట్టణాధ్యక్షుడు మేకల తిరుపతి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పుల్ల రాధ, కౌన్సిలర్లు సమ్మయ్య, సొల్లు సునీత, మొగిలి, సందమల్ల పుణ్య, వెంకట్, జన్నోజు భాస్కర్, సీనియర్ నాయకులు సొల్లు బాబు, రాజిరెడ్డి, సమ్మిరెడ్డి, కుమారస్వామి, సంపత్, ఉప్పు శ్రీనివాస్, సందమల్ల బాబు తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *