సంప్రదాయాన్ని పాటిద్దాం – సహజత్వాన్ని రక్షిద్దాం.
సహజ రంగుల పండుగ – మన హోలి పండుగ
• సంప్రదాయాన్ని పాటిద్దాం – సహజత్వాన్ని రక్షిద్దాం.
• కృత్రిమ రసాయన రంగుల వాడుకను నిషేదిద్దాం
. సహజ సిద్ద రంగులను వాడుకుందాం.
• పర్యావరణ హితంగా పండుగలను జరుపుకుందాం . ఆరోగ్యకర ప్రకృతిని వరసత్వంగా ఇద్దాం.
– రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త.
మన సాంప్రదాయ పండుగలు చాలా గొప్పవి. భారతదేశం ఆచార వ్యవహారాలను, అందరి మధ్య స్నేహా బంధాలను, సంతోషంతో కలిసిమెలిసి జీవించే విధంగా ఉంటాయి. మన సంస్కృతిని, సాంప్రదాయాలను పూర్వ తరాలనుండి ఒక వారసత్వ ఆస్తిగా మనకు ఇస్తూ, ఇదే సంస్కృతి సంప్రదాయాలను క్రమశిక్షణతో మనపిల్లలు అనుకరించి, అనుసరించేలా ఆదర్శంగా వారికీ నేర్పుతూ వారిద్వారా రాబోవు తరాలకందిస్తున్నది. ప్రపంచ దేశాలకు ఒక గొప్ప శాంతి సంతోషాలకు ఆదర్శమవుతున్నది. ఇది మన పండుగ గొప్ప ప్రాశస్త్యం. మనం జరుపునే ఒక్కొక్క పండుగ ఒక్కొక్క మానవ విలువలతో కూడుకున్న భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతాయి. విలువలతో కూడుకున్న అర్ధంతో, ఆరోగ్యంతోపాటు క్రమశిక్షణ, పెద్దలపట్ల, ఎదుటివారిపట్ల గౌరవాన్ని పెంచేలా అనుసంధానం చేస్తాయి.
మన పండుగలు మానవ విలువలు, మనవ సంబంధాలను పెంచడంతోపాటు మనచ్చుట్టువున్న ప్రకృతిని, పర్యావరణాన్ని హానిజరుగకుండా జరుపబడేవి. కానీ ఇప్పుడు మనిషి జీవనం నూతన పోకడలతో, పాశ్చాత్య సంప్రదాయాల వలలో చిక్కుకుంటోంది. పండుగలు జరుపుకునే విధానమే కోల్పోతూ, పండుగ ఆస్తిత్వన్నే మార్చబడుతోంది. జరుపుకునే విధానం ఇదేనేమో అని చిన్నపిల్లలు అనుకునేస్థాయికి పడిపోతున్నాయి. నూతన ఒరవడితో మన పండుగలు పోటీపాడుతూ సాంఘిక స్థాయిని చూపెట్టుకునేలా చూపేట్టుకునే స్థాయికి పడిపోయే మార్పులోస్తున్నాయి. ఇలాగే జరిగితే రానున్న రోజుల్లో సంస్కృతి, సంప్రదాయాలతో పాటు, పర్యావరణహానితో ఆరోగ్యాలు, బంధాల ప్రాముఖ్యతను కోల్పోయి రాగద్వేషాలా కుంపట్లో పడి మనుషుల మధ్య విద్వేషాలు రగిలించే ప్రమాదమున్నది.
మన ఒక్కక్క పండుగకు ఒక్కొక్క విశిష్టత కలిగి ఉన్నది. ఖండంతరాలలో కూడా ఈ పండగలు అన్యోన్యంగా జరుపుకోబడుతున్నాయి. ఈ తరుణంలో మనపండుగల ఆస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకునే బాధ్యత మన అందరి భుజస్కందాలపైన పైన బాధ్యగా ఉన్నది.
హోలీ అనేది రంగుల పండుగ, ఇది వసంత ఋతువు రావడంతో ప్రేమ మరియు ఆనందాలతో, కొత్త ఉత్సాహలతో ఒకరితో ఒకరు జరుపుకునే పండుగ. హిందువుల పండుగగా ఇది భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్ మరియు ఇతర ప్రాంతాల్లోని ప్రజలు జరుపుకుంటారు.
ప్రజలు రంగుల పొడిని, రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ పుట్టుటకు పౌరాణిక ప్రాముఖ్యత వున్నది. హోలీ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు, ముఖ్యంగా ప్రహ్లాదుడు తన రాక్షస తండ్రి హిరణ్యకశిపుపై సాధించిన విజయం, భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ హోలి పండగ. దేశాన్ని, ప్రాంతాన్ని, భాషా సాంప్రదాయాలానుసారంగా ఈ పండుగను ఇతర పేర్లు లో దుల్‌హేతి, ధులండి, ధులెండి అని కూడా పిలుస్తారు. హోలీకా దహనంచేసేందుకు హోలీకి ఒకరోజు ముందు కామదహనం (హోలికా దహనం) నిర్వహిస్తారు, మరుసటి రోజు హోలీ వేడుకలు జరుపుకుంటారు. హోలీ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
మన పండుగలలో ఒకటైన *సహజ రంగుల పండుగ హోలీ పండుగ.* ఈ పండుగ రోజు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు కలిసి వివిధ సహజ రంగులతో చేసుకున్న రంగులతో హోలీ పండుగ చేసుకుంటారు. సామరస్యంతో, కేరింతలతో సంతోషంగా, ఆరోగ్యానికి హానికరం కాకుండా, ప్రకృతికి, పంచాభూతాలకు ఎలాంటి హాని జరుగకుండా వాటిని గౌరవిస్తూ జరుపుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో పండుగ జరుపుకునే తీరు మారిపోతోంది. ముఖ్యంగా పర్యావరణ హితమైనా స్థానంలో కృత్రిమ రసాయనాలతో తయారైనా రంగులను వాడుతున్నారు. తద్వారా మనుషుల ఆరోగ్యానికి హానికరమేకాకా పర్యావరణానికి ఎంతో హానిజరుగుతోంది. భూమి, నీరు, గాలి కలుషితమై ప్రమాదకరమైన రసాయణాలు మనుషులతో పాటు ఇతర ప్రానికోటికి హాని చేకురుస్తున్నాయి. వాటి జీవన విధానాన్ని, సమతుల్యతను మర్చివేసి హానిని చేకూరస్తూనాయి.
ఇతరుణంలో మనం గ్రహించి పూర్వ వైభవాన్ని మళ్ళీ ముందుకు తెచ్చుకొనే భాద్యత తీసుకోవాలి. పూర్వపు సంస్కృతి, సాంప్రదాయాల రక్షణాతోపాటు, ప్రకృతి, పర్యావరణ సమతుల్యత జీవవరణ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు విధిగా ప్రమాదకరమైన రసాయన రంగులవాడుకను బహిస్కరించి, సహజసిద్దమైన పసుపు, మోదుగ పువ్వుల, మందార పువ్వుల, పాలకూర, గోరింటాకు,బీట్రూట్ మొదలగు వాటితో చేసుకున్న రంగులను తయారుచేసుకొని హాలిపండుగను అనందోత్సాహాలతో ఒకరికొకరు సంతోహంకోసం జరుకొని హాయిగా జీవిస్తూ రాబోవుతారాలకు ఇదే స్ఫూర్తిని, రక్షిత పర్యావరణాన్ని అందివ్వాలి. ఇదే నిజమైన పండుగ వేడుక.
– రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, జాయింట్ సెక్రటరీ, ఓర్గల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్జీవో (OWLS NGO) వరంగల్, వైస్ ప్రెసిడెంట్, UFEP NGO, వరంగల్, మరియు ఫార్మర్ ఫాకల్టీ, CWR, JNTUH, హైదరాబాద్.
