శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
శ్రీ చైతన్య సీ.బీ.ఎస్.ఈ సివో ఐపీఎల్ పాఠశాలలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
● ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కేంద్రంలో శ్రీ చైతన్య సీబీఎస్సీ చింతకుంట బ్రాంచ్లో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ.. 1857 సిపాయిల తిరుగుబాటుతో మొదట స్వాతంత్ర పోరాటం జరిగిందన్నారు. 1874లో చాపెకర్ సోదరుల పోరాటం విరోచితం అని అన్నారు. పూణేలోని ప్లేగు వ్యాధి సంతరించిన సమయంలో విద్యార్థులు యోగులు అందరు పోరాటం చేసి ప్లేగు వ్యాధి వ్యతిరేకంగా పోరాటం జరిగిందన్నారు. 1905లో బెంగాల్ విభజన కోసం అనేక ప్రయత్నాలు జరిగిన ఆ పోరాటంలో వందేమాతరం ఉద్యమం ప్రారంభం అయ్యిందన్నారు. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కి తగ్గి బెంగాల్ విభజనను రద్దు చేశారన్నారు. ఇతర దేశాల్లో చదువుకున్న భారతీయులంతా స్వతంత్ర ఉద్యమం కోసం ఆలోచించడం మొదలుపెట్టారన్నారు. ఆ తర్వాత 1914లో గాంధీజీ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాలు దేశం మొత్తం తిరిగి భారతదేశ అసమానతలు తెలుసుకొని అసలు సిసలైన భారతదేశానికి స్వాతంత్ర రావాలని ఆలోచించి ముందుకు వెళ్లారన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పెద్ద స్తంభాలపై జాతీయ జెండా ఎగురవేశారన్నారు. ఈ ఉద్యమం తర్వాత దేశంలో అనేక ప్రాంతాలలో స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో బ్రిటిష్ అధికారులు మనకి స్వాతంత్రం ప్రకటించారన్నారు. 1947 ఆగస్టు 15న భారతదేశ స్వాతంత్ర దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుందన్నారు. దాదాపు 78 సంవత్సరాలుగా మనం స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగిస్తున్న సమయం విద్యార్థులందరూ దేవుని ప్రగతికి కోసం ఆలోచించి దేశ అభివృద్ధికి తోడ్పడాలనిపిస్తుందన్నారు. విద్యార్థులంతా భవిష్యత్తులో భారతదేశ అభివృద్ధి తోడ్పడాలన్నారు. అనంతరం విద్యార్థులు ఉపన్యాస పోటీలు, నృత్య పోటీలు, వ్యాసరచన పోటీలు, నిర్వహించారు. ఆగస్టులో జరిగిన బై వీక్లి టెస్ట్ లో ఆల్ ఇండియాలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపల్ నీలిమా సివో ఐపిల్ ఇంచార్జ్ శ్రీకాంత్ రెడ్డి, సి బ్యాచ్ ఇంచార్జ్ జై వర్ధన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ గోవర్ధన్, ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఇన్చార్జులు పిఈటి పవన్, ప్రవీణ్, సుజాత, నికిత, అపర్ణ, భవాని, అభి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

