రుణమాఫీతో రైతుల కళ్ళల్లో ఆనందం…
రుణమాఫీతో రైతు కళ్ళల్లో ఆనందం…
. ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి సిఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది..
. రుణమాఫీ రాష్ట్ర, దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం..
. ఆగస్టు 15 వరకు 2 లక్షల పూర్తి రుణమాఫీ చేసి తీరుతాం..
. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్..
. హుజురాబాద్ రైతుల పక్షాన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు.
. పట్టణంలో రైతులతో బైక్ ర్యాలీ
హుజురాబాద్:
ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీని అమలు చేస్తున్న సందర్భంగా హుజరాబాద్ రైతువేదిక వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా రైతులతో కలిసి హుజురాబాద్ పట్టణం నుండి రైతువేదిక వద్దకు బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వొడితల ప్రణవ్ మాట్లాడారు. వ్యవసాయం దండుగా అన్న నానుడు నుంచి వ్యవసాయం, వ్యవసాయం చేసే రైతు బాగుపడాలని ఆలోచించే ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ అని, రైతుల కళ్ళల్లో ఆనందమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. లక్ష లోపు ఉన్న రైతుల రుణాల మాఫీ కోసం ప్రభుత్వం 7 వేల కోట్లను రైతుల అకౌంట్లో జమ చేసిందని తెలిపారు. అనంతరం రైతులతో కలిసి స్వీట్లు పంచుతూ బాణాసంచా కాల్చి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో రైతు ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందన్నారు. దేశ, రాష్ట్ర చరిత్రలో రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఏకకాలంలో 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకేసారి రుణమాఫీ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ ప్రభుత్వాలూ ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ రైతుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చగా రుణమాఫీ పేరుతో కాలయాపన చేసి పూర్తిగా రుణమాఫీ చేయకుండా బ్యాంకుల చుట్టూ తిప్పించుకున్నారన విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే చెప్పిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఆగస్టు 15 లోపు పూర్తిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నమన్నారు. గత ప్రభుత్వాలు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన అవన్నింటినీ అధిగమించి 7 నెలల్లో రైతులకు ఇచ్చిన మాట తప్పవద్దనే ఉద్దేశం కొద్దీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఇటు రైతుల సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తుందన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని రుణమాఫీ ద్వారా ప్రజలకు మరింత చేరువవుతామని వారు అన్నారు. లక్ష వరకు ఉన్న రుణాలను గురువారం రోజు సాయంత్రం వరకు వారి అకౌంట్లో డబ్బులను ప్రభుత్వం వేస్తుందని, రెండవ విడుతలో లక్ష 50 వేల ఉన్న వరకు రుణాలను ఈ నెలాఖరు వరకు మాఫీ చేస్తామని, పంద్రాగస్టు వరకు రెండు లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే సంబంధిత బ్యాంకు వెళ్లిలన్నారు. అక్కడ సమస్య పరిష్కారం చేసుకొనటానికి నోడల్ ఆఫీసర్ ఉంటాడన్నారు. రుణమాఫీ విషయంలో రైతులు ఏలాంటి ఆందోళన చెందవద్దని అర్హులైన అందరికీ రుణమాఫీ వర్తిస్తుందన్నారు. అనంతరం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ ల చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకురాలు సునీత, వ్యవసాయ అధికారి సునీల్ కుమార్, సింగిల్ విండో అధ్యక్షులు ఎడవల్లి కొండల్ రెడ్డి, కౌరు సుగుణాకర్ రెడ్డి, అలుమల్ల శ్యాంసుందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, మాజీ పిఏసిఎస్ చైర్మన్ గూడూరు స్వామిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నెబోయిన శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నేరెల్ల మహేందర్ గౌడ్, పొనగంటి మల్లయ్య, సీనియర్ నాయకులు 30వ వార్డు కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, సొల్లు బాబు, కాజీపేట శ్రీనివాస్, కిరణ్ కుమార్, శ్రీనివాస్, రాజు, ఖాళీద్ హుస్సేన్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత, పూదరి రేణుక, జిల్లా ఉపాధ్యక్షులు అలెటి సుశీల, సొల్లు సునీత, లావణ్య,రాధ, రేణుక, స్వప్న, కరీమ, స్వరూప తదితర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
