హుజురాబాద్ లో ప్రారంభమైన హస్తకళ మేళా…
చేనేత హస్తకళ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
. మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక
హుజురాబాద్:
చేనేత హస్తకళ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక అన్నారు. పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ మహాలక్ష్మి కళ్యాణ మండపంలో శ్రీ కళాకృతి చేనేత హస్తకళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత, హస్తకళ ప్రదర్శనను బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన స్టాళ్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ… మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి, జైపూర్ కాటన్ ప్రింటింగ్ వస్త్రాలతో పాటు హైదరాబాద్ బ్లాక్ ప్రింటింగ్ శారీస్, బెంగాలి కాటన్, మంగళగిరి నారాయణపేట, దర్మవరం, పోచంపల్లి, మధ్యప్రదేశ్, టస్కర్, భాగలపూరి స్కిల్ చీరలు, లక్నో చీరలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. డ్రస్ మెటీరియల్ కలంకారి మంగళగిరి, చీరాల, పోచంపల్లి, నారాయణపేట అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హస్తకళా వస్తువులు, హైదరాబాద్ ముత్యాలు, ఆభరణాలు, గోల్డ్ కవరింగ్ ఆభరణాలు, చెక్కబొమ్మలు, వుడ్ కార్వింగ్, సారంగపూర్ వుడ్ ఐటమ్స్, జైపూర్ పెయింటింగ్స్, తిరుపూర్ గార్మెంట్స్, లాక్‌బాంగిల్స్, హెర్బల్ పౌడర్స్, బ్లాక్ అండ్ వైట్ మెటల్ బొమ్మలున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్ సారంగపూర్ చెక్క సామాగ్రి, పోచంపల్లి దుప్పట్లు, మీరట్ ఖాదీ రెడీమేడ్ దుస్తులు ఉన్నాయన్నారు. వినియోగదారులకు నేరుగా ఉత్పత్తి దారుల నుంచి తక్కువ ధరకు అందించటమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఇట్టి మేళా ఈ నెల 25 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశం వినియోగదారులు ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో జూపాక సింగిల్ విండో సభ్యులు కంకణాల రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
