పుల్లూరి ప్రభాకర్ రావుకు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు

0

పుల్లూరి ప్రభాకర్ రావుకు డెయిరీ ఇండస్ట్రీస్ లో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు

హుజురాబాద్:
హుజురాబాద్ నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డెయిరీ అదినేత పుల్లూరి ప్రభాకర్ రావు డెయిరీ ఇండస్ట్రీస్ లో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. గత నెలలో హైదరాబాద్ బిజినెస్ ఎక్సలెన్స్ 2024 అవార్డులను ప్రకటించింది. కాగా ఫిబ్రవరి 24న హైదరాబాదులో జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో డెయిరీ డైరెక్టర్ పుల్లూరి గణేష్ రావు ఈ ఎక్స్ లెన్స్ అవార్డును అందుకున్నారు. శనివారం హుజురాబాద్ లోని పరకాల క్రాస్ రోడ్ వద్ద గల నాగార్జున డెయిరీలో అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డెయిరీ అధినేత ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. డెయిరీ స్థాపించిన నాటి నుండి నిరంతర శ్రమిస్తూ, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పరిశోధిస్తూ ప్రైవేటు సెక్టార్లో డెయిరీని అగ్రగామిగా నిలబెట్టడం జరిగిందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధునాతన శాస్త్ర సాంకేతిక యంత్ర సామాగ్రిని ఉపయోగించి వినియోగదారుల అభిరుచుల మేరకు నూతన పాల ఉత్పత్తులను తయారు చేసి అందిస్తున్నామన్నారు. డెయిరిలో సుదీర్ఘ అనుభవం, వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన సిబ్బంది అందుబాటులో ఉండి సహకరించడం మూలంగానే సాధ్యమైందన్నారు. డెయిరిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. డెయిరి అభివృద్ధి కోసం సహకరిస్తున్న సిబ్బందికి, డెయిరి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రభాకర్ రావు ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ క్లబ్ సభ్యులు చోల్లేటి కిషన్ రెడ్డి, న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి, డెయిరి సీఈవో కృష్ణ ప్రసాద్, ఏజీఎం ఆకునూరి సుధాకర్, ప్రొక్యూర్మెంట్ మేనేజర్ వెంకటస్వామి, మార్కెటింగ్ మేనేజర్లు, ఏజెంట్లు, డెయిరి సిబ్బంది, గణపతి సీడ్ మేనేజర్ రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *