నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా…
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా…
. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మంగళవారం తొలిసారిగా హుజురాబాద్ వచ్చిన కౌశిక్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు తానెప్పుడు కృతజ్ఞుడనై ఉంటానన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి తనను గెలిపించారని వారికి ఎల్లవేళలా తోడుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలా పనిచేస్తానన్నారు. ప్రజల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
కౌశిక్ రెడ్డికి అభినందనల వెల్లువ…
హుజురాబాద్ పార్టీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పలువురు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శాలువాలు కప్పి పుష్ప గుచ్చాలు ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక-శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాజ ముత్యం రాజు, రమాదేవి, సుశీల బిఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయకుమార్, శాంతన్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
