రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్ర సీఎంగా ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం పట్ల హుజరాబాద్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి, సంబరాలు జరపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే సరైన నాయకుడన్నారు. పేదల పక్షాన నిలబడి వారి సంక్షేమం కోసం పనిచేస్తారన్నారు. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, మండల అధ్యక్షురాలు లావణ్య, పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎండి అఫ్సర్, ఖాలీద్ హుస్సేన్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, జమదగ్ని, చంద్రశేఖర్, కిరణ్ రెడ్డి, యూత్ నాయకులు అషూ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చల్లురి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
