అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించాలి

3

అర్హులైన వారందరిని ఓటర్లుగా నమోదుచేయాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్:
జిల్లాలో అర్హులైన వారందరిని ఓటర్లుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..అర్హులైన ప్రతిఒక్కరికి ఓటు హక్కును కల్పించాలని, ఓటరు జాబితాలో ఓటర్ల సవరణ కచ్చితంగా చేయాలన్నారు. జనవరి 1, 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కును కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో సవరణ 2024 నాటికి ముందు పోలింగ్ పునర్ వ్యవస్థీకరణ చేయాలన్నారు. చనిపోయిన వారి పేర్లను మరణ దృవీకరణనల అధారంతో జాబితా నుండి తొలగించాలని అన్నారు. బదిలి అయిన వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. నూతన పొలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఫోటో ల మార్పు తదితర పనులను 20 డిసెంబర్ నుండి 5 జనవరి 2024 వరకు నిర్వహిచడం జరుగుతుందన్నారు. జనవరి 6 నుండి 22 వరకు డ్రాఫ్ట్ రోల్ పై అభ్యంతరాలు, వాదనలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యఎన్నికల అధికారులు సూచించిన శని, ఆదివారాలలో స్పెషల్ క్యాంపేయిన్ లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 2న అభ్యంతరాలను డిస్పోస్ చేయడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 6న ఆరోగ్యవంతమైన తుది ప్రచురణ కోసం కమీషన్ అనుమతికి పంపించి వారి అనుమతి మేరకు ఫిబ్రవరి 8న తుది జాబితాను విడుదల చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్, కరీంనగర్ ఆర్డివో కె. మహేశ్వర్, కరీంనగర్ మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, బిఎస్పి పార్టీ ప్రతినిధి గోలి అనీల్ కమార్, బిజేపి పార్టీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, సిపిఐ (యం) పార్టీ ప్రతినిధి డి నరేష్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మెహన చారి, ఏయంఐయం పార్టీ ప్రతినిధి మెహమ్మద్ అబ్బస్ సమి, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, టిడిపి పార్టీ ప్రతినిధి కళ్యాడపు అగయ్య, తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *