ఎం ఆర్ ఎఫ్ ఆధ్వర్యంలో ఆదరణ విద్యార్థులకు సరుకులు పంపిణీ
ఎమ్మార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…
*ఆదరణ విద్యార్థులకు సరుకులు పంపిణీ*
హైదరాబాద్, అక్టోబర్ 11:
సీనియర్ పాత్రికేయుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేస్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య తండ్రి స్వర్గీయ మామిడి రామయ్య 16వ వర్ధంతి సందర్బంగా ఆదివారం మామిడి రామయ్య ఫౌండేషన్(ఎంఆర్ ఎఫ్) ఆధ్వర్యంలో సరూర్ నగర్ లోని ఆదరణ విద్యార్థుల ఆశ్రమంలో నిత్యావసర సరుకులు పంపిణి చేశారు.ఆశ్రమంలో ఉంటూ, చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల కోసం అవసరమైన నిత్యావసర సరుకులను ఫౌండేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆదరణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జే. మాధవరావుకు అందజేశారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, తన తండ్రి స్వర్గీయ మామిడి రామయ్య స్మారకార్ధం గత 15 సంవత్సరాలుగా ఎమ్మార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఆయన వర్ధంతి రోజు పేదలకు తనవంతు సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. సమాజంలో ఎంతోమంది అనాధ పిల్లలు, వృద్దులు దిక్కులేని స్థితిలో జీవశ్చవాలుగా బతుకుతున్నారని, అలాంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. పాతికేళ్ళుగా అనాధ పిల్లలను చేరదీసి విద్యావంతులను చేస్తున్న ఆదరణ సంస్థ నిర్వహకులు అభినందనీయులని మామిడి సోమయ్య పేర్కొంటూ, ఈ సందర్భంగా ఆదరణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జే. మాధవరావు ను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు కుంచం శ్రీనివాస్, యర్రమిల్లి రామారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అశోక్ కుమార్ గౌడ్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ రవికుమార్, ఎల్బీగగర్ నియోజకవర్గం కోశాధికారి నంబి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
