ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

0

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హుజురాబాద్:
హుజరాబాద్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి జండా ఎగరవేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.
ఆర్డీవో కార్యాలయంలో…
ఆర్డీవో కార్యాలయంలో ఆర్డివో రమేష్ బాబు జెండా ఎగరవేశారు. తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కనకయ్య జెండా ఎగురవేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ సహాయ సంచాలకులు సునీత జండా ఎగరవేశారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సమ్మయ్య ఎగురవేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడివో, ఏసీపీ కార్యాలయంలో ఏసిపి మాధవి, స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ కరుణాకర్, ఆర్ అండ్ బి కార్యాలయంలో డిఈ, పంచాయతీరాజ్ కార్యాలయంలో డిఇ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏంవిఐ, ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ జెండా ఎగురవేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆసుపత్రి డాక్టర్ నారాయణరెడ్డి జండా ఎగరవేశారు. అనంతరం సిబ్బందిని ఘనంగా సన్మానించారు. స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *