ఘనంగా వోడితల ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలు

0

ఘనంగా వోడితల ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలు
హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ యువ నాయకుడు ఒడితల ప్రణవ్ బాబు జన్మదిన వేడుకలు శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని సింగపూర్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుజురాబాద్ హనుమాన్ దేవాలయంలో, ఇల్లంతకుంట దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు ఈ సందర్భంగా భారీ కేక్ లు కట్ చేసి మిఠాయిలు తినిపించారు. గజమాలతో, శాలువాలతో ప్రణవును ఘనంగా సత్కరించారు. రక్తదాన శిబిరాలు, అన్నదానం నిర్వహించారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కార్యకర్తలు, నాయకులు అభిలాషించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానంతో పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అండగా ఉండి వారి అభివృద్ధికి తాను తోడ్పడుతానని అన్నారు. ప్రజల, కార్యకర్తల అభిమానంతో మరిన్ని నియోజకవర్గంలో మంచి పనులను పూర్తి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *