మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు: మంత్రి సీతక్క

8287

మేడారం:

దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద జాతర మేడారం జాతర అని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శనివారం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలోని మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నాలుగు రోజులలో 1కోటి45 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారనీ అన్నారు. జాతర నిర్వహణకు అత్యధిక నిధులు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు, మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దేవాదాయ మంత్రి కొండా సురేఖ రవాణా శాఖ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పి, ఇతర 20 శాఖల అధికారులు జాతర ఏర్పాట్లకు కష్టపడ్డారని కితాబునిచ్చారు. వార్తలను ఎప్పటికపుడు బయట ప్రపంచానికి చెరవేసిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఆర్టీసీ సంస్థ ద్వారా మేడారం జాతరకు 10 వేల ట్రిప్పుల బస్సులు నడిచాయని 13మంది వివిఐపిలు 150 మంది వీఐపీ లు అమ్మవార్లను దర్శించుకున్నారని అన్నారు.గతం తో పోలిస్తే ఈ సారి జాతర చాలా మెరుగుగా జరిగిందన్నారు. జాతర లో ఏమైనా లోపాలు ఉంటే అధికారులతో రివ్యూ నిర్వహించి తిరుగువారం తర్వాత శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తామన్నారు. మిసింగ్ క్యాంపుల ద్వారా 5090 మంది భక్తులు తప్పితే 5060 మంది తప్పిపోయిన భక్తులను వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం జరిగిందన్నారు.దాదాపు వారం రోజుల నుండి సమ్మక్క సారలమ్మ వైబవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చూపించిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *