అటవీ ప్రాంతంలో 3 వేల మొక్కలతో రీఫారెస్టేషన్..
అటవీ ప్రాంతంలో 3 వేల మొక్కలతో రీఫారెస్టేషన్..
. మొక్కలను నాటి రక్షణ కల్పిస్తున్న “నేచర్ ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ సొసైటీ”
. పూర్తి సహకారం అందిస్తున్న రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్
. అభినందించిన ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ
అచ్చంపేట, అమ్రాబాద్:
అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో జోన్ -4 లో బొమ్మనపల్లి సమీపంలో ఆక్రమణకు గురైన 5 ఎకరాల అటవీ భూమిలో మల్లీ చట్టపరంగా రిజర్వు ఫారెస్ట్ కాళీ చేయించి అదే అటవీ భూమిలో 3 వేల పండ్ల మొక్కలతో రిఫారెస్టేషన్ చేశారు. ఈ అరుదైన కార్యక్రమం ఫారెస్ట్ అధికారుల సౌజన్యంతో ఎన్జీవోలు “నేచర్ ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ” అచ్చంపేట, “రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్” జూబ్లీహిల్స్, హైదరాబాద్, “ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వరంగల్ భాగస్వామ్యంతో మొక్కలను నాటారు. రిఫారెస్టేషన్ లో పెద్ద పెద్ద పండ్ల మొక్కలు, నీడ నిచ్చే, పెద్ద వేరు వ్యవస్థ కలిగిన మఱ్ఱి, రావి, చింత, వేప, మొక్కలను నాటడం విశేషం. అడవిని కాపాడుకోకపోతే జీవవైవిద్య లోపము జరిగి ఆవాసాలు క్షీణిస్తాయని వివిధ స్వచ్చంద సంస్థలు పేర్కొన్నాయి. ఇలాంటి మంచి కార్యక్రమాలకు తమవంతు సహాయ సహకారాలు ఉంటాయని మిగిలిన 15 ఎకరాలకు కావలసిన అదే సహాయం అందుతుందని స్వచ్చంద సంస్థలు అన్నాయి. ఈ కార్యక్రమంలో అమ్రాబాద్ పులుల అభయారణ్య శిక్షణ అధికారి సుశాంత్ సుఖీదేవ్ బొబాడే, నేచర్ ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరి అచ్చంపేట జెట్టి రమేష్, రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్, జూబ్లీహిల్స్ హైదరాబాద్ జిల్లా గవర్నర్ ఎలక్ట్ రాంప్రసాద్, అధ్యక్షులు బాలకోటి, ప్రముఖ పర్యావరణవేత్త, జాయింట్ సెక్రటరీ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వరంగల్ పిట్టల రవిబాబు, తెలంగాణ వర్కింగ్ జరలిస్టుల ఫెడరేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డా. బండి విజయ్ కుమార్, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు, పర్యావరణ ప్రేమికులు తిరుపతి, రవికుమార్, ఫారెస్ట్ బీట్ అధికారిణి పి. స్వాతి మరియు ఫారెస్ట్ స్టాఫ్, వాచెర్స్, బొమ్మనపల్లి తదితర గ్రామాల ప్రముఖులు, స్థానిక యువకులు, యువ నాయకులు, జంతుప్రేమికులు తదితరులు పాల్గొన్నారు.
