దేశ అభివృద్ధి కోసం సంకల్ప యాత్ర..

0

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర వాహనాల ప్రారంభం..
. వర్చువల్ గా వాహనాలను ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
. రాష్ట్రాల అభివృద్దితో దేశాన్ని అభివృద్ది పరచాలనే ఉద్దేశ్యంతో 5 రాష్ట్రాల్లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర
. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్

కరీంనగర్:
ఈ నెల16 నుండి 26 జనవరి 2024 వరకు చేపట్టనున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర అవగాహన ప్రచార వాహనాలు ప్రారంభమైనట్లు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయ అవరణలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రచార వాహనాల ప్రారంభ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండిసంజయ్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. శనివారం సాయంత్రం వర్చువల్ గా వాహనాలను భారత ప్రదాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రదాని ప్రసంగాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా అధికారులతో కలసి వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాలను ఎంపీ సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపి మాట్లాడుతూ…2047 నాటికీ అభివృద్ది చెందిన దేశంగా భారత్ ను తయారు చేయాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోదీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై దేశంలోని ప్రతి మారుమూల గ్రామాల్లో సైతం అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా లబ్దిపొందిన లబ్దిదారులను కలవడంతో పాటు వారిద్వారా ఇతర ప్రజలు సహా ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా మద్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ఘడ్, తెలంగాణా, మిజోరాం రాష్ట్రాలలో ‘‘వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర’’ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

దాదాపు 55 కోట్ల మంది ప్రజలకు పైగా ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద పేద ప్రజలకు 5 లక్షల విలువ చేసే ఉచిత వైద్యాన్ని అందించడం జరుగుతుందన్నారు. దాదాపు 10 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ లను అందించడం జరిగిందని, 11 కోట్లకు పైగా కిసాన్ సమ్మాన నిధి పేరుతో రైతులకు సంవత్సరానికి 6 వేల రూపాయలను అందించడం జరుగుతుందన్నారు. నిలువనీడలేని దాదాపు 4 కోట్లమంది పేదలకు ప్రదానమంత్రి ఆవాస్ యోజన ప్రథకం క్రింద ఇళ్లున నిర్మించడం జరుగుతుందని తెలిపారు. 80 కోట్లకు పైగా ప్రధానమంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన ప్రథకం క్రింద ఉచితరేషన్ అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రాల అభివృద్దితో దేశాన్ని అభివృద్ది పరచాలనే ఉద్దేశ్యంతో 5 రాష్ట్రాల్లో యాత్రను ప్రదానమంత్రి యాత్రను ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డిఆర్డిఓ శ్రీలత, ఎల్ డి ఎం ఆంజనేయులు, ఎస్బియం కిషన్ స్వౌమి, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, నెహుయువ కేంద్రం కో ఆర్డినేటర్ రాంబాబు, ఎన్ఐఓ శివ రాములు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఇతర అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *