ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 

0

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

– జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

. అలరింపజేసిన చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు

వరంగల్:
వరంగల్ జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్ మైదానంలో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి  స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి  ప్రజలను ఉద్దేశిస్తూ జిల్లా ప్రగతి గురించి వివరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య,
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, నగర మేయర్ గుండు సుధారాణి, శాసనమండలి సభ్యులు బస్వారాజు సారయ్య, శాసనసభ్యులు కె ఆర్ నాగరాజ్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీపీ అంకిత్ కుమార్ లతో కలిసి  స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు  తెలియజేస్తూ ఏర్పాటుచేసిన స్టాల్స్ లను మంత్రి సందర్శించారు. ఈ వేడుకల్లో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, నగర మేయర్ గుండు సుధారాణి, శాసనమండలి సభ్యులు బస్వారాజు సారయ్య,  శాసనసభ్యులు కె ఆర్ నాగరాజ్, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వైసిపి శుభం, డిఆర్ ఓ విజయలక్ష్మి స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది స్వాతంత్ర సమరయోధులు ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *