ఘనంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం 

0

హన్మకొండ:

ప్రపంచ పిచ్ఛుకల దినోత్సవం ను పురస్కరించుకొని, పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక (UFEP) మరియు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటి (OWLS) సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండ పబ్లిక్ గార్డెన్, టౌన్ హాల్ వద్ద జరిగిన అవగాహనా కార్యక్రమం లో కె.పురుషోత్తం, విశ్రాంత జిల్లా అటవీ శాఖ అధికారి (అధ్యక్షుడు, UFEP) అధ్యక్షోపన్యాసం చేశారు.

ఊర పిచ్చుకల దినోత్సవం నాసిక్ లో ఎండీ. దిలావరు 2008 లో ప్రారంభించిన విషయాన్ని, వ్యవసాయ రసాయన కాలుష్యాలు, సెల్ టవర్ మైక్రోవేవ్ రేడియేషన్ ప్రభావం వల్ల ఊర పిచ్చుకల సంతతి నశిస్తున్న విషయం, మనం చేపట్టాల్సిన చెట్ల పెంపకం, పక్షుల సంరక్షణా చర్యలు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హనుమకొండ DRO, Y.V. గణేష్ ఊర పిచ్చుకల పై పోస్టర్, కరపత్రంలను ఆవిష్కరించారు. వారి సందేశం లో మనుషులకున్నట్టే, పశు పక్ష్యాదులకు కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని, వాటి సంరక్షణకు పండ్ల చెట్లు, పచ్చదనం పెంచడం ముఖ్యం అన్నారు.

విశిష్ట అతిధి K.విజయకుమార్, ఏసిపి, సైబర్ క్రైమ్, హన్మకొండ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ, వనాలను, వన్యప్రాణులను కాపాడుతూ కాలుష్యాలను నివారించాలని, ఊళ్లు వదిలి పట్టణాలకు వచ్చాక ఊర పిచ్చుకలను ఇంత వరకు పెద్దగా పట్టిచ్చు కోలేదు, కానీ ఈ అవగాహన ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి అన్నారు. పిమ్మట అతిథులచే పబ్లిక్ గార్డెన్ వాకర్స్ కు, ఎన్జీవో బాధ్యులకు 200 నీటి మట్టి చిప్పలను నిర్వాహకులు ఉచితంగా పంపిణీ చేశారు. తదుపరిగౌరవ అతితులకు వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫీ చేయచిత్రాలను అందచేశారు.

ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సి.హెచ్. శ్యాంసుందర్ శర్మ ప్రపంచ పిచ్ఛుకల దినోత్సవం నేపథ్యాన్ని, ఆవశ్యకతను వాటిరక్షణ కోసం 5 సంవత్సరాలు గా తాము ఔల్స్ ద్వారా చేస్తున్న కృషిని అందరికి వివరించారు. వివరించి అందరిచే పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక (UFEP), ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ (OWLS) అధ్యక్షులు, ఇందారం నాగేశ్వర రావుతో పాటు వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పర్యావరణవేత్త పిట్టల రవిబాబు, యం.పరుశరాములు, పి.రాజ్ కుమార్, వి.శ్రీనివాస్, అనితారెడ్డి, ఎండీ.షిరాజుద్దీన్, K.దామోదర్, వి.సుధాకర్ స్వామి, శాంతారామ్ కర్ణ, బూర గాంధీ, పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్, ప్రెసిడెంట్, NIT Prof.ద్రోనంరాజు కేశవ రావు, బీ.రమేష్, మునిసిపాలిటి ఉద్యానవన అధికారి, మొదలగు వారు హాజరైనారు. పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక, UFEP ప్రధాన కార్యదర్శి టి. శ్రవణ్ కుమార్ వందనసమర్పణ తో అవగాహనా కార్యక్రమం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *