అంధుల పాఠశాలలో పండ్ల పంపిణీ
అంధుల పాఠశాలలో పండ్లు, ఆలౌట్స్, నిత్యావసరాలు పంపిణీ
కరీంనగర్:
బూక్య బన్నాజీ-శారద దంపతుల కుమార్తె ప్రజ్ఞశ్రీ ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టరుగా ఎంపికైన సందర్బంగా అంధుల పాఠశాల విద్యార్థులకు పండ్లు, ఆలౌట్స్, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్బంగా ప్రజ్ఞశ్రీ మరెన్నో ఉన్నత ఉద్యోగ ఉన్నత పదవులు అధిరోహించాలని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ భాస్కర్ గారు, ననువాల గిరిధర్ రావు, మానువాడ శంకర్, చిలుపూరి రాములు, మోహన్ బాబు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
