ఇంటింటా ప్రచారం నిర్వహించిన కటకం లోకేష్

1

బండి సంజయ్ ని గెలిపించండి
. ఇంటింటా ప్రచారం నిర్వహించిన కటకం లోకేష్
కరీంనగర్:
ప్రజా సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తున్న కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కి మరోసారి అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బిజెపి మీడియా కన్వీనర్ కటకం లోకేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం కరీంనగర్ పట్టణంలోని సుభాష్ నగర్ బుట్టి రాజారాం కాలనీ పరిధిలోని ఐదు పోలింగ్ బూత్ లలో కటకం లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్ధానిక బిజేపి శ్రేణులతో కలసి కటకం లోకేష్ ఇంటింట ప్రచారాన్ని చేపట్టారు. బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరినీ కటకం లోకేష్ అభ్యర్ధించారు. పదేళ్ళ బిజెపి మోదీ ప్రభుత్వ పాలన పై ప్రజలంతా పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని, తిరిగి బిజెపి ప్రభుత్వమే కేంద్రంలో ఉండాలనే భావన పజల్లో ఉందన్నారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అభివృద్ధి సాధకుడని, పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి సంజయ్, బిజెపి ప్రభుత్వం తోనే సాధ్యామన్నారు. జరుగబోయే ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా పోలింగ్ బూత్ బాధ్యులు, నిఖిల్, ప్రణయ్, అవినాష్, సందీప్, వంశీ, ప్రేమ్, మహేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *