కేంద్రంలో వచ్చేది హంగే.. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్

2

కేంద్రంలో వచ్చేది హంగే..బీజేపీకి 200 లకు మించి సీట్లు రావు
. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే కీలక పాత్ర పోషిస్తారు
. గోదావరిని తరలించుకు పోతామన్న సీఎంకు పట్టింపు లేదు
. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు
. హన్మకొండ రోడ్ షో లో మాజీ సీఎం కెసిఆర్
హనుమకొండ :
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన నాలుగు నెలల్లో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని, రానున్న ప్రభుత్వం మనదేనని టిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోపించారు. ఆదివారం సాయంత్రం 18వ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండ అదాలత్ సెంటర్ నుండి హనుమకొండ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ పదేళ్లలో ప్రజలకు ఒరగపెట్టింది ఏం లేదని, బిజెపికి కాంగ్రెస్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, ఇప్పటికీ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుబంధు ఇప్పటివరకు వేయలేదని, రైతుల దగ్గర నుండి ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యతిరేక భావాన్ని కలిగి ఉందని, నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను నట్టేట ముంచాలని చూసిందని, అసలు బిజెపికి ఓటు అడిగే అర్హత లేదని, తెలంగాణ ప్రజలు మాయ మాటలను నమ్మవద్దని ఆయన అన్నారు. రాష్ట్రంలో 14 సీట్లు గెలుచుకుంటే ప్రభుత్వం మెడలు వంచి పని చేయిస్తానని, పార్లమెంటులో సమర్థవంతంగా మాట్లాడే సత్తా ఒక టిఆర్ఎస్ పార్టీ ఉందని, దేశంలో ప్రజలు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారని. సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ప్రజలు ఎవరు అధైర్య పడవద్దని ఆయన అన్నారు.1969 నుండి వరంగల్ జిల్లాకు నాకు సంబంధం ఉందని ఈ ప్రాంతంలో కాలోజీ, జయశంకర్ ఉద్యమానికి ఊపిరి పోసారని తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గతంలో 30 వేల కోట్లు రైతుల రుణమాఫీ చేశానని, డిసెంబర్ 9 తారీఖున రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఈ ముఖ్యమంత్రి అన్న మాటలు అమలు జరిగాయా, తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి వేలాది మందిర్ కూలీలు రోడ్డులో పడ్డారు, గతంలో టీఎస్ ఐ పాస్ తీసుకువచ్చి 21 రోజుల్లోనే పర్మిషన్ ఇచ్చామన్నారు, కానీ ప్రస్తుత ప్రభుత్వం పర్మిషన్లను ఇవ్వడం లేదని కెసిఆర్ ఆరోపించారు. మరొక భయంకరమైన పార్టీ బిజెపి పార్టీ అని యువకులు బిజెపి పట్ల ఆకర్షితులు కావద్దని దేశంలో 200 సీట్లకు మించి బిజెపికి రావని, కాబట్టి వచ్చే పార్లమెంటు ఎన్నికలలో అంగు ప్రభుత్వం ఏర్పడుతుందని ఇందులో భారత రాష్ట్ర సమితి ప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషిస్తారని కాబట్టి ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన అన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాల్సి ఉండగా ప్రధానమంత్రి రాష్ట్రానికి గుజరాత్ కు తరలించుకుపోయాడని, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని 10 సంవత్సరాల నుంచి అడుగుతుంటే మొన్నటికి మొన్న లేఖలఇచ్చినరని అన్నారు గోదావరి, కృష్ణ నదుల నీళ్లను దోసుకుపోవడానికి ప్రధానమంత్రి చేస్తున్న దౌర్జన్యాన్ని మనమందరం వ్యతిరేకించి రెండు నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రాణం పోయినా ఈ రెండు నదులను కాపాడుకుంటామని ఇందుకు మీరు సహకారాలు అందించాలన్నారు. చేతగాని రేవంత్ రెడ్డి గోదావరి కృష్ణ నీళ్లలో కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టాడని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే నిరుద్యోగం పెరిగిపోతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుబంధు, కరెంటు పండించిన పంట కొనుగోలు చేయడంలో విఫలమైందన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి యుద్ధం చేద్దామా ఇందుకు మీరందరూ టిఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని, ఇక్కడ ఒక మనిషికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పటికీ తాను పార్టీ మారిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు ఆయనే కడియం శ్రీహరి, మరో మూడు నెలల్లో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం స్టేషను ఘన్ పూర్ లో ఉప ఎన్నిక వస్తుందని,అప్పడు రాజయ్యే ఎమ్మెల్యే అవుతాడని అన్నారు. కెసిఆర్ కు జైలు కొత్త కాదని, తాను జైలుకు భయపడితే తెలంగాణ వచ్చేదా, అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇంత గోరంగా ఉన్నాయో తెలుసా నా లాగు ఊడదీస్తాడట, నా చెడ్డి ఊడదీస్తాడట ఇదేనా మాట్లాడే మాటలు నేను పది సంవత్సరాల్లో ఏనాడైనా ఇటువంటి మాటలు మాట్లాడినా ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఫుల్లు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి అని కెసిఆర్ అన్నారు. మే 13 వ తారీఖున జరిగే ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కెసిఆర్ తను ఎన్నికల ప్రచారం రోడ్ షోలో ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ లోకసభ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి, బండ ప్రకాష్, జనగామ ఎమ్మెల్యే, పల్లె రాజేశ్వర్ రెడ్డి, మాజీఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

2 thoughts on “కేంద్రంలో వచ్చేది హంగే.. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *