దళిత బంధు పేరిట దగా చేసిన బిఆర్ఎస్…

2

దళిత బంధు పేరిట దగా చేసిన బిఆర్ఎస్…
. దళిత బంధు నిధులు దారి మళ్లించింది వాస్తవం కాదా…
. దళిత బంధు పథకాన్ని పాకెట్ మనీ లా వాడుకున్న బీఆర్ఎస్..
. టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్
హుజురాబాద్:
దళిత బంధు పేరిట దగా చేసి దళితులను మోసం చేసింది బీఆర్ఎస్ నాయకులేనని టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ అన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. దళిత బంధు నిధులు ఫ్రీజింగ్ చేసి ఆ నిధులను దారి మళ్లించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. ఈ విషయం అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డికి తెలిసిన ఎన్నికల్లో లబ్ధి పొందడానికి దళితులను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేటీఆర్ మెప్పుకోసం అబద్దాలతో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడని దుయ్యబట్టారు. దళిత బంధు పేరుతో బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దళిత బందులో ఎవరెవరు ఎంత దోచుకున్నారో పక్కా ఆధారాలతో బయటపెడతామని, ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. దళిత బంధు పేరుతో రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి వొడితల ప్రణవ్ కృషి చేస్తున్నారని, అది జీర్ణించుకోలేక కేసీఆర్, కేటీఆర్ కు బానిసగా మారి కౌశిక్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేస్తున్నాడని మండిపడ్డారు. దళిత బంధు విషయం పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, తప్పకుండా దళితులకు న్యాయం చేస్తుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *