వైల్డ్ లైఫ్ సేవలు అమోఘం
ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి
– వైల్డ్ లైఫ్ సేవలు అమోఘం
– కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సెలర్ కె ప్రతాపరెడ్డి
కాకతీయ యూనివర్సిటీ:
ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డి అన్నారు. మంగళవారం కాకతీయ యూనివర్సిటీలో ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ ఎన్జివో వరంగల్ తాము స్వయంగా తీసిన అటవీ ఛాయా చిత్రాల (వైల్డ్‌లైఫ్ ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్) ప్రదర్శనశాలను కాకతీయ విశ్వవిద్యాలయ వాణిజ్య, వ్యాపార నిర్వహణ కళాశాలకు ఎదురుగ స్టాల్ లో ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఔల్స్ స్వయంగా తీసి వివరనలతో కూడిన అటవీ ఛాయా చిత్రాలు, అందమైన జలపాతలు గ్యాలరీ ప్రదర్శన సందర్బంగా యూనివర్సిటీ వాణిజ్య, వ్యాపార విద్యార్థినీ విద్యార్థులకు, ఆచార్యులకు ప్రకృతి, పర్యావరణం, అడవి, అటవీ జంతువులు, సహజవనరులు వాటి ప్రాధాన్యత, వాటి పాత్ర, వాటి జీవన విధానం, సంరక్షణ, తరిగిపోతున్న వనాలు, వన్యాలు, వాటి విలువలు, అటవీ ఛాయచిత్ర విశిష్టత అవసరాలగూర్చి ముఖ్యంగా జలపాతల వ్యవస్థల గూర్చి తమ అనుభవాలను ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇందారం నాగేశ్వర్ రావు ఈ సందర్బంగా వాణిజ్య, వ్యాపార పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులకు, ఆచార్యులకు ప్రతీ ఛాయచిత్రాన్ని ప్రకతిలో దాని ధర్మాన్ని తెలియచేస్తూ అవగాహనా కల్పించారు. అదేవిధంగా ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ జాయింట్ సెక్రటరీ, ప్రముఖ పర్యావరణ వేత్త రవిబాబు పిట్టల విద్యార్థులకు, అధ్యాపకులకు భూగ్రహం, బౌమ్యావరణం, జీవవరణం అటవీ ఆవరణం, జలావరణం, వాయు ఆవరణం ముఖ్యంగా అటవీ వ్యవస్థల తీరుతెన్నులు, వన్యప్రాణులు వాటి ఆవశ్యకత పై వివరించారు. సహజ వనరుల తరుగుదలకు ప్రధాన కారణాలు, పర్యావరణ, అటవీ, నీటి, వాయు చట్టాలను, జంతువుల, పక్షుల వేట, అక్రమ రవాణా (వైల్డ్ ట్రేడ్), దాని పర్యవసానాలు, భారత రాజ్యాంగం ఆర్టికల్ 51ఏ/(జి) ప్రకారంగా తమ చుట్టూ వున్నా పర్యావరణం, అడవులు, వన్యప్రాణుల పట్ల భూతదయ, సహజ వనరులను రక్షించి కాపాడుకోవడం ఈ దేశ ప్రతీ పౌరుని ప్రాథమిక విధి అని గుర్తు చేశారు. పూర్వికులు మనకిచ్చిన ఈ జాతీయ సంపదలను అవసరమున్నంతే వాడుకొని ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని ఒక ఆస్తిగా భావించి ఈ జాతీయ సంపదను ఇదేరూపంలో రాబోవు తరాలకు వారసత్వ ఆస్తిగా కాపాడి ఇవ్వాలని హితువు పలికారు. ఏమరపాటుగా బాధ్యత మరిచి మెదులుకుంటే మిగిలి ఉన్న వనరులు దుర్వినియోగం అవుతాయన్నారు. వాటిని అవసరమున్నంతే వాడుకుంటేనే మానవ, ఇతర జీవుల మనుగడ కొనసాగుతుందని భవిష్యత్ పరిణామాలను వివరించారు. మానవులతోపాటు ఈ భూమండలంపైన అన్ని జీవులకు సమానమైన జీవించే హక్కు ఉందని, అహక్కును మానవుడు తమకొక్కరికే ఉందని విర్రవీగుతూ మారుతున్న పర్యావరణ మార్పులను లెక్కచేయకుండా ప్రకృతి వైపరిత్యాల ప్రకోపానికి గురి అవుతున్నాడని గుర్తు చేసారు. భూమి కోత మరియు భూమి కాలుష్యం, జల కాలుష్యం, గాలి కాలుస్యం కారణాలు, రక్షణ చర్యలు వివరించారు. ఇకనైనా ప్రకృతి చేస్తున్న వైపరీత్యాల హెచ్చరికలను మానవుడు సూక్ష్మంగా అర్ధం చేసుకొని తమలో మార్పుతేచ్చుకొని వ్యక్తిగత భాద్యతగా ఉండాలని గుర్తుచేసారు. విద్యార్థులు అడిగినసందేహాలను వివరనతో అవగాహనా కల్పించారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రో. వి. రామచంద్రం, వాణిజ్య, వ్యాపార నిర్వహణ కళాశాల ప్రిన్సిపాల్ ప్రో. పసునూరి అమరవేణి, ఆచార్యుల బృందానికి, అలాగే”టార్చ్ ఎన్జీవో వ్యవస్థపాక అధ్యక్షులు అరవింద్ ఆర్యా కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ ఛాయా చిత్రాల (వైల్డ్‌లైఫ్ ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్) ప్రదర్శనశాలకు నిర్వహించుకునే అవకాశామిచ్చిన “సినర్జీ – 2కె25 విద్యార్థుల సమ్మేళనం” కార్యవర్గసభ్యులు, కోఆర్డినేటర్స్ కుమారి సౌమ్యశ్రీ, సంయుక్త, భరత్, జయంత్, బి. పవన్, సాయి ఉజ్వల, జె. సచిన్, పాషా, ప్రవీణ్, రాధాకృష్ణ, స్నిగ్ధ, కావ్య, సంజన, కార్యనిర్వాహకులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

