వరంగల్ ను రెండో అతిపెద్ద సిటీగా మారుస్తాం
వరంగల్ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ.
. ఓరుగల్లును రెండో అతిపెద్ద సిటీగా అభివృద్ధి చేస్తాం
. కవిత మాటలు హాస్యాస్పదం
హనుమకొండ:
వరంగల్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపెట్టిందని రాష్ట్ర దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం గ్రేటర్ వరంగల్ లో పలు అభివృద్ధి పనుల పై సమీక్షా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు అభివృద్ధి మరిచి కబ్జాలకు, రౌడీయిజం కే పరిమితం అయ్యారని విమర్శించారు. గతంలో ఎమ్మెల్యే నిధులను, సిఎంఎఫ్, సీడీఫ్ ఫండ్ లను వాడుకోలేకపోయారన్నారు. వరంగల్ ఎమ్మెల్యే 3కోట్ల నిధులు కూడా వాడుకోలేదన్నారు. వరంగల్ ను రెండో అతి పెద్ద సిటీగా తయారు చేస్తామన్నారు. వర్దన్నపేట లో నూతనంగా గ్రౌండ్ ను నిర్మిస్తామన్నారు. వరంగల్ బస్టాండ్ ను అదనాతన హంగులతో తీర్చిదిద్దామన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు.
ఎమ్మెల్సీ కవిత మాటలు హాస్యాస్పదం..
ఎమ్మెల్సీ కవిత మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. మాలిదశ ఉద్యమకారులకు బిఆర్ఎస్ ఏమి చేసిందో చెప్పాలన్నారు. ప్రియాంక గాంధీతో రెండు గ్యారెంటీలు ఏ విదంగా అమలు చేస్తారని అంటున్న కవిత హిమన్ష్ ఏ హోదా తో రాములవారికి పట్టు వస్త్రలు సమర్పించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. లిక్కర్ రాణి నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుతారని ఘాటైన విమర్శలు చేశారు. కవితకు దమ్ముంటే నిజామాబాదు లో మళ్ళీ పోటీ చేసి గెలువాలన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా జ్యోతి రావు పూలె మీద లేని ప్రేమ ఇప్పుడు వచ్చిందా అని ప్రశ్నించారు.
