ఘనంగా కాట్రావుల పండుగ..

0

ఘనంగా కాట్రావుల పండుగ..
– ఆచారాన్ని కాపాడుకుంటున్న ఆ గ్రామ‌స్తులు
హుజురాబాద్:
సంక్రాంతి పండుగ సందర్భంగా వ్యవసాయ బావుల వద్ద రైతులు జరుపుకునే కాట్రావుల పండుగ కనుమరుగై పోతున్న క్రమంలో హుజురాబాద్ మండలం చిన్నపాపయ్యపల్లి గ్రామంలో భోగి రోజు ఈ పండుగను గ్రామ సర్పంచ్ చల్లూరి చిరంజీవి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను స్థానిక రైతులు ఘనంగా నిర్వ‌హించారు. ఎడ్లు, పశువులు కనుమరుగవుతున్న క్రమంలో ఈ గ్రామంలో ఉన్న పశువులకు కాట్రావుల పండుగ సందర్భంగా స్నానాలు చేయించి, కొమ్ములకు జాజు పూసి, పూల దండలువేసి తోరణాల కింది నుంచి తోలారు. రైతు జీవితంతో ముడిపడి ఉన్న ఎడ్లకు ఏడాదికి ఒక సారి సంక్రాంతి సందర్భంగా వచ్చే కాట్రావుల పండుగ ఒకప్పుడు ప్రతి గ్రామంలో రైతులు ఘనంగా జరుపుకునేవారు. అప్పట్లో పశువులు, నాగటెద్దులు, పాడిగేదెలతో రైతుల కొట్టాలు కళకళలాడేవి. ఇపుడు కాట్రావుల పండుగను జరుపుకునే రైతులే కరువైన నేపథ్యంలో చిన్నపాపయ్య పల్లి గ్రామంలో ఈ ఆచారాన్ని కాపాడుతూ రైతులు ఆదర్శంగా నిలిచారు. ఇక నుండి ప్రతి ఏటా ఇలాగే కాట్రావుల పండుగను జరుపుకుంటామని స్థానిక రైతులు తెలిపారు. రైతులు ఈ సంప్రదాయిన్ని కొనసాగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *