వైభవంగా గోదాదేవి కళ్యాణం…
అంగరంగ వైభవంగా గోదాదేవి కళ్యాణం…
కరీంనగర్:
నీరుకుల్లా-వేగురుపల్లి గ్రామాల మధ్యన మానేటి నది తీరాన వెలసిన శ్రీ స్వయంభు మానేటి రంగనాయక స్వామి దేవస్థానం లో గోదా రంగనాథుల కల్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవం శ్రీ మానేటి రంగనాయక స్వామి ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి మనోహరాచార్యులు, సహాయార్చకులు గోవర్ధనగిరి రాజకుమారాచార్యులు, వేద పండితులు జగన్నాథా చార్యుల ఆధ్వర్యంలో కన్నులపండువగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో మారుమోగింది. గోదా రంగనాథుల విశిష్టతను తెలుపుతూ అర్చకులు కల్యాణం జరిపించారు. వేదమంత్రాల నడుమ, శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ క్రతువులో సుమారు 15 మంది దంపతులు పాల్గొన్నారు. కరీంనగర్, పెద్దపెల్లి జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శంకర్ అద్భుతమైన గానంతో భక్తులను ఆనందిపజేశారు. గోదాదేవి కళ్యాణానికి హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శంకర్, ఎండోమెంట్ క్లర్క్ ప్రవీణ్, ఆలయ కమిటీ సభ్యులు పెరుమారెడ్డి, సత్యనారాయణ, దామోదర్, వేగురుపల్లి, నీరుకుల్లా సర్పంచులు పాల్గొన్నారు.
