నక్షత్ర తాబేలును జూకు అప్పగించిన పర్యావరణవేత్త

4

భారతీయ నక్షత్ర తాబేలును జూకు అప్పగించిన పర్యావరణవేత్త రవిబాబు
హన్మకొండ:
జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం, గోవర్ధనగిరి గ్రామపంచాయతీ పరిధిలో గల వనమాల శ్రీధర్ యొక్క వ్యవసాయ భూమి దున్నుతుండగా ఒక అందమైన తాబేలు అదే రైతుకు దొరికింది. దానిని ఆ రైతు తన ఇంటికి తీసుకువెళ్లి ఉంచడం జరిగింది. ఆ తర్వాత తాబేలును “ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ” స్వచ్చంద సంస్థ, వరంగల్, జాయింట్ సెక్రటరీ మరియు పర్యావరణ వేత్త పిట్టల రవిబాబుకు అదే రైతు స్వయంగా తెలియపరచడం జరిగింది. వెంటనే ఆయన దానిని పరిశీలించి అది అరుదైన ఒక భారతీయ నక్షత్ర తాబేలు (జియోచెలోన్ ఎలగాన్స్) గా గుర్తించి అది వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972, షెడ్యూల్ -4 కిందికి వస్తుందని ఇది చాలా అరుదైనటువంటి రెప్టైల్ జాతి జీవి అని, దాన్ని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు అప్పచెప్పాలని తెలియపరచగా మీరే అప్పజెప్పండి అని రైతు నక్షత్ర తాబేలు రవి బాబుకు అప్పచెప్పగా బాధ్యత తీసుకొని వెంటనే ఇట్టి సమాచారాన్ని కాకతీయ జూలాజికల్ పార్క్ హనుమకొండ ఎఫ్.ఆర్.ఓ. మయూరి కి తెలియపరచడం జరిగింది. వెంటనే స్పందించిన జూ ఎఫ్.ఆర్.ఓ. మయూరి దానిని జూ కు తీసుకు రమ్మని ఆదేశించారు. ఆ వెంటనే రవిబాబు భారతీయ నక్షత్ర తాబేలు సురక్షితమైనటువంటి ఒక డబ్బాలో పెట్టుకుని దానిని జూ పార్కు తరలించి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సెక్షన్ అధికారి రాందాస్ సమక్షంలో దానిని జూ పార్కులో ఇవ్వడం జరిగింది. దానిని వెంటనే అక్కడే ఉన్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్ సాంబరాజు చే పరిశీలన చేయించి అది ఆరోగ్యంగా ఉన్నదని నిర్ధారణ చేసిన తర్వాత దానిని ఒక ప్రత్యేకమైనటువంటి జాలిగదిలో వేసి క్వా రెంటైన్ చేయించారు.
ఫారెస్ట్ సెక్షన్ అధికారి రాందాస్ నక్షత్ర తాబేలు ను ఇచ్చినట్టుగా రసీదు కూడా రవి బాబు ఇవ్వడం జరిగింది. అంతటితో ఆగకుండా అట్టి నక్షత్ర తాబేలును పోషణ నిమిత్తం ఎవరికైనా దత్తత ఇవ్వాలని “కాకతీయ జూ యానిమల్ అడాప్షన్ స్కీం” కింద ఒక సంవత్సరానికి సరిపడి రుసుము చెల్లింప చేయించాలని జంతు ప్రేమికురాలు, కవయిత్రి, సాహితీవేత్త మణి రాయల్ టీచర్, మహబూబ్ నగర్ ను కోరగా వెంటనే స్పందించి ఆమె దానికి ఒక సంవత్సరానికి సరిపడు పోషణ నిమిత్తము రుసుము ఇచ్చి దత్తత తీసుకొని ఆ జంతువులపై ఉన్నటువంటి ప్రేమను తెలియపరిచి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా పర్యావరణవేత్త రవి బాబు మాట్లాడుతూ భారతీయ నక్షత్ర తాబేలు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక మొదలగు దేశాలలో ఈ జాతి ఎక్కువగా ఉంటుందని కానీ ఇవి ఇప్పుడు అంతరించిపోతున్న జాతులలో ఇది కూడా ఒకటే అని, దీనికి కారణం వాటి ఆవాసాల విధ్వంసం మరియు వాటిని మూఢనమ్మకాల కు సంకతంగా చీకటి మార్కెట్లో అక్రమంగా అంతర్జాతీయ రవాణా చేయడం మొదలకు కారణాలు ఉన్నాయని తెలియపరిచాడు. ఈ నక్షత్ర తాబేళ్లు వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం వాటిని షెడ్యూల్ – 4 క్రింద ఇవి వస్తాయని, అదేవిధంగా ఐ.యూ.సీ.ఎన్. రెడ్ జాబితాలో వీటిని విలీప్తమైపోతున్న జీవులలో చేర్చారని, వీటిని రక్షించుటకై కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ స్పీసిస్ (CITES) అప్పెండిక్స్ – I లో చేర్చి రక్షిస్తున్నారని, వీటిని అక్రమంగా పెంచిన, అమ్మిన, తిన్న, రవాణా చేసిన చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. మన చుట్టూ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, సహజ వనరులను, పర్యావరణాన్ని, అడవులను, జీవులను అన్నిటిని రక్షించుకునే బాధ్యత భారత పౌరులుగా మన అందరి పైన ఉందని, దానిని మనం భరత రాజ్యాంగం, ఆర్టికల్ 51 ఏ / జి మన ప్రాధమిక విధిని తెలియజేస్తుందని ఈసందర్బంగా గుర్తు చేసారు.
ఈ ఇంత చక్కని కార్యానికి సకరించిన ఫారెస్ట్ ఎఫ్. ఆర్. వో. మయూరి, పర్యావరణవేత్త పిట్టల రవిబాబు, ఎఫ్. ఆర్. వో. మయూరి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, రాందాస్, బీట్ ఆఫీసర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సాంబరాజు భారతీయ నక్షత్ర తాబేలును మగ తాబేలు గా గుర్తించారు , ఫారెస్ట్ సిబ్బంది, రైతు వనమాల శ్రీధర్, పిట్టల ఎల్లయ్య, శంకరి జానీ, వలబోజు వెంకటేశ్వర్లు తదితరులు సహకరించి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *