జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
– పిఎసిఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి
హుజురాబాద్:
ప్రభుత్వం రాయితీపై అందించే జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ పిఎసిఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో శనివారం రైతులకు వ్యవసాయ శాఖ అధికారి భూమ్ రెడ్డి తో కలసి జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీలుగ విత్తనాలను పంట పొలంలో వేసుకుని 45 రోజుల తర్వాల కలియ దున్నడం వల్ల పంట దిగుబడి పెరగడంతో పాటు భూమి సారవంతంగా మారుతుందన్నారు. ఏవో భూమ్ రెడ్డి మాట్లాడుతూ… 30 కేజీల జీలుగ విత్తనాలను రాయితీపై పంపిణీ చేస్తామని తెలిపారు. మండలానికి 250 క్వింటాళ్లు కేటాయించారని, 30 కేజీల బస్తా ధర రూ.2,452.లుగా నిర్ణయించారని చెప్పారు. విత్తనాలు కావాల్సిన రైతు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలను తీసుకుని క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి పర్మిట్ పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, వ్యవసాయ విస్తరణ అధికారి అఖిల్, డీసీఎంఎస్ ఇంఛార్జి రమేష్ ఉన్నారు.
