అభివృద్ధి చేసే అవకాశం కల్పించండి కాంగ్రెస్ అభ్యర్థి హరిబాబు
ఆదరించి ఆశీర్వదించండి..
– అభివృద్ధి చేసే అవకాశం కల్పించండి
– కాంగ్రెస్ పార్టీ 21వ వార్డు అభ్యర్థి గుర్రం హరిబాబు
హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని 21వ వార్డు అభివృద్ధి కోసం తనను ఆదరించి ఆశీర్వదిస్తే వార్డును మరింత అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్రం హరిబాబు పేర్కొన్నారు. శుక్రవారం 21 వ వార్డులో ఇంటింటికి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులో ప్రజల మద్దతును పొందుతూ ముందుకు సాగుతున్నారు. నేరుగా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డులో మౌలిక సౌకర్యాల ఏర్పాటుతోపాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరం ఖాయమని తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వార్డును అభివృద్ధి చేసి చూయిస్తానని స్పష్టం చేశారు.
