బాలికలు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలి

0

బాలికలు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలి
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
120 మంది బాలికలకు నెల రోజులు పైగా ఎన్టిపిసి ద్వారా వర్క్ షాప్ నిర్వహణ
– ఎన్టిపిసి సంస్థ చేసే మంచి పనులు ప్రజలకు చేరేలా కార్యాచరణ
ఎన్టిపిసిలో నిర్వహించిన బాలికా సాధికారత మిషన్ వర్క్ షాప్ 2025 ముగింపు వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
పెద్దపల్లి:
బాలిక సాధికారత వర్క్ షాప్ లో పాల్గొన్న 120 మంది బాలికలు జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకాంక్షించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఎన్టిపిసి ఈడిఎం ఆడిటోరియంలో నిర్వహించిన బాలికా సాధికారత మిషన్ వర్క్ షాప్ 2025 ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ…పెద్దపల్లి జిల్లా పరిధిలో ఎన్టిపిసి సంస్థ ఏర్పాటు చేసి 50 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రజలకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి విజయవంతంగా చేస్తూ దేశ అభివృద్ధికి బాటలు వేయడం పట్ల తనకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఎన్టిపిసి సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యానికి, ఉన్నత అధికారులు, సిబ్బందికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. బాలికా సాధికారత మిషన్ వర్క్ షాప్ 2025 క్రింద 120 మంది బాలికలకు 30 రోజుల పాటు శిక్షణ అందించారని తెలిపారు. బాలికలు శిక్షణ ముగిసిన తర్వాత మంచి ఆత్మవిశ్వాసం స్పష్టంగా తెలుస్తోందని, ఇట్టి మార్పు సాధ్యం చేసిన ఎన్టిపిసి సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. బాలికా సాధికారత మిషన్ వర్క్ షాప్ 2025 ను పూర్తి చేసుకున్న బాలికలు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, రాబోయే 5,10 సంవత్సరాల తర్వాత 120 మంది బాలికలు గొప్ప స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. బాలికలు తమ జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, ప్రతి రోజూ రెగ్యులర్ గా లక్ష్యం వైపు కొంత సమయం సాధన చేయాలని అన్నారు ‌ వర్క్ షాప్ విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఎన్టిపిసి సంస్థ అనేక మంచి పనులు చేస్తుందని, వీటికి విస్తృత ప్రచారం కల్పించాలని, అదే విధంగా ప్రజలలో ఎన్టిపిసి ఏం చేయడం లేదు అనే అభిప్రాయాన్ని తొలగించేందుకు కృషి చేయాలని, మనం చేసే మంచి పని ప్రజలకు చేరడం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్టి.పి.సి.ఈ.డి చందన్ కుమార్ సామంత, రాఖీ సమంత బిజొయ్ కుమార్ సిక్దర్ ,సింగ రాయ్, బాబర్ సలీం పాషా, ప్రవీణ్ చౌదరి వేముగంటి యుగేందర్ రావు సిఎస్ఆర్-హెచ్ఆర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *