హుజురాబాద్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్
ఉత్కంఠకు తెర..
– హుజురాబాద్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్
– మున్సిపల్ చైర్ పర్సన్ గా రొంటాల సుహాసిని
– వైస్ చైర్మన్ గా గూడూరి అంజలి
– కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
హుజురాబాద్:
హుజరాబాద్ లో గత రెండు రోజులుగా మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం ఎవరిని వరిస్తోందని ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 13న కౌంటింగ్ జరిగిన విషయము విధితమే. ఈ ఎన్నికల్లో 16 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు 8 మంది బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఐదుగురు బిజెపి కౌన్సిలర్లు ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరారు కాగా చైర్ పర్సన్ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన కౌన్సిలర్లను ఆ పార్టీ నాయకులు క్యాంపుకు తరలించారు. సోమవారం నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. గెలుపొందిన అభ్యర్థులచే సోమవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు ఒక స్వతంత్ర అభ్యర్థి తో పాటు బిఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన 8 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. బిజెపి పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్కంఠ భరిత వాతావరణం మధ్య చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
మున్సిపల్ చైర్ పర్సన్ గా సుహాసిని..
హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గా రొంటాల సుహాసిని ఎన్నుకున్నారు. పట్టణంలోని 30 వ వార్డు నుండి సువాసిని ఎన్నికయ్యారు.
వైస్ చైర్మన్ గా గూడూరి అంజలి..
మున్సిపల్ వైస్ చైర్మన్ గా గూడూరి అంజలిని ఎన్నుకున్నారు. పట్టణంలోని 8వ వార్డు నుండి అంజలి గెలుపొందారు.

హుజరాబాద్ మున్సిపల్ కౌన్సిల్లో 17 మంది మహిళలే…
హుజురాబాద్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో 17 మంది మహిళలే విజయం సాధించారు. అందులో కాంగ్రెస్ నుండి 8 మంది, బిజెపి నుండి నలుగురు, బిఆర్ఎస్ నుండి ఐదుగురు మహిళలు విజయం సాధించారు. కాగా ఈ 17 మందిలో 15 మంది అభ్యర్థులు మున్సిపల్ కౌన్సిల్లో కొత్తవాళ్లే..తొలిసారిగా కౌన్సిల్‌లో అడుగుపెట్టడం గమనార్హం.
