తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

0

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

– కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్

– కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

హుజూరాబాద్ అక్టోబర్ 15 తెలుగు ప్రభ:
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముందస్తుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయాన్ని పూలతో అందంగా అలంకరించి, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా నాయకురాళ్లతో కలిసి ప్రణవ్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మహిళల జీవితాల్లో ఆనందాన్ని నింపే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. ప్రకృతిని పూల రూపంలో పూజిస్తూ, తెలంగాణ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తూ, వారి అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ మండలాల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *