శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు
కరీంనగర్ పోలీస్ కమీషనర్ – గౌస్ ఆలం.
కరీంనగర్:
కమీషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల దృష్ట్యా నియమ నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సంబంధిత ఏసీపీ ల నుంచి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిర్వహించకూడదని తెలిపారు. అనుమతులు లేకుండా ఎటువంటి సభలు సమావేశాలు,ర్యాలీలు నిర్వహించకూడదని సంబంధిత అధికారుల నుండి అనుమతులు తప్పనిసరి అని తెలిపారు అనుమతుల కోసం దరఖాస్తు చేయడం ద్వారా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అట్టి కార్యక్రమానికి తగిన విధంగా పోలీసు శాఖ భద్రతాపరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు
ఈ చట్టం అమలులో వుండగా ఇతరులను గాయపరిచే విధంగా ఉండే వస్తువులు, మారణాయుధాలను ధరించి సంచరించకూడదు. రోడ్లు, ప్రజలకు ఉపయోగపడే ఇతర స్థలాల్లో జనాన్ని సమీకరించకూడదు.జన సంచారం మరియు అనుమతి పత్రాలలో పేర్కొన్నబడిన ప్రాంతాలలో మ్యూజిక్ లు, పాటలు, ప్రసంగాలు, రణగొణ ధ్వనులు చేయవద్దని కోరారు. ఈ ఉత్తర్వులు ఈనెల 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం చర్యలుతీసుకుంటామని సి పి తెలిపారు.
