మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే.

0

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే…
– 16 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్.
– 8 స్థానాలకే పరిమితమైన బిఆర్ఎస్
– 5 వార్డుల్లో విజయం సాధించిన బిజెపి
– స్వతంత్ర అభ్యర్థి విజయం
హుజురాబాద్:
హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ హవా కొనసాగింది. హుజురాబాద్ పట్టణంలో 30 వార్డులు ఉన్నాయి. అందులో 30 వార్డులకు ఈ నెల 11న ఎన్నికలు జరిగాయి. కాగా శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను వెల్లడించారు.
హుజరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు….
1 వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి గుంటి వెంకటమ్మ పై కాంగ్రెస్ అభ్యర్థి మేకల స్వరూప 94 ఓట్లతో విజయం సాధించింది. రెండవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఫరహాన సుల్తానా పై 28 ఓట్ల తేడాతో బిఆర్ఎస్ అభ్యర్థి సమ్రిన్ గఫార్ గెలుపొందారు. మూడో వార్డులో బిజెపి అభ్యర్థి రావుల ప్రభాకర్ పై 99 ఓట్లతో బిఆర్ఎస్ అభ్యర్థి గందె శ్రీనివాస్ గెలుపొందారు. నాలుగో వార్డులో బిజెపి అభ్యర్థి అంకతి రత్తమ్మ పై బిఆర్ఎస్ అభ్యర్థి ప్రతాప తార 197 ఓట్లతో విజయం సాధించారు. ఐదో వార్డులో స్వతంత్ర అభ్యర్థి సొల్లు పూజపై కాంగ్రెస్ అభ్యర్థి సొల్లు సునీత 54 ఓట్లతో గెలుపొందారు. ఆరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి బొరగాల సురేష్ పై బిఆర్ ఎస్ అభ్యర్థి బండ సింధుజ 44 ఓట్లతో విజయం సాధించింది. ఏడవ వార్డులో బిజెపి అభ్యర్థి ఇల్లందుల ప్రణీత్ కుమార్ పై 6 ఓట్ల తేడాతో బండ నరేష్ గెలుపొందారు. ఎనిమిదవ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి గుండా అనూషపై కాంగ్రెస్ అభ్యర్థి గూడూరి అంజలి 191 ఓట్లతో విజయం సాధించారు. తొమ్మిదవ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి ఇల్లందుల మౌనికపై కాంగ్రెస్ అభ్యర్థి ఇల్లందుల సమ్మయ్య 376 ఓట్లతో విజయం సాధించారు. 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శనిగరపు మౌనికపై బిజెపి అభ్యర్థి కొలుగూరి సుమలత 105 ఓట్లతో గెలుపొందారు. 11వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి కొలిపాక అజయ్ పై కాంగ్రెస్ అభ్యర్థి జున్నోజు భాస్కర్ 76 ఓట్లతో విజయం సాధించారు. 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జూపాక సంపత్ పై బిఆర్ఎస్ అభ్యర్థి వర్ధినేని రవీందర్ రావు 60 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 13వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వేముల పుష్పలతపై కాంగ్రెస్ అభ్యర్థి సందమల్ల పుణ్య 327 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 14వ వార్డులో బిజెపి అభ్యర్థి గంట సంపత్ పై కాంగ్రెస్ అభ్యర్థి వజ్జపల్లి వెంకటేశ్వర్లు 173 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 15వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి బర్మావత్ యాదగిరి పై కాంగ్రెస్ అభ్యర్థి బానోతు వెంకటస్వామి 151 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 16వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుశీల పై కాంగ్రెస్ అభ్యర్థి బండ వెన్నెల 64 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి బాబా షరీఫ్ ఉద్దీన్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఖాలిక్ హుస్సేన్ 186 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జమలాపురి రాణి పై బిఆర్ఎస్ అభ్యర్థి ప్రతాప మంజుల 5 ఓట్లతో గెలుపొందారు. 19 వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి అపరాజ ముత్యం రాజు పై స్వతంత్ర అభ్యర్థి గోస్కుల రాజు కుమార్ 99 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 20 వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి కొయ్యడ శ్రీదేవి పై బిజెపి అభ్యర్థి దామెర అనూష అనురాగ్ 183 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 21వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గుర్రం హరిబాబు పై బిజెపి అభ్యర్థి పంజాల మనోజ్ గౌడ్ 42 ఓట్ల తో విజయం సాధించారు. 22వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి తలకొక్కుల శ్యామలపై కాంగ్రెస్ అభ్యర్థి వడ్లూరి శ్రీలేఖ 152 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 23 వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి ములుగు సృజనా కుమారి పై బిజెపి అభ్యర్థి కాలేదాస్ లక్ష్మీ దుర్గ 9 ఓట్లతో విజయం సాధించారు. 24 వార్డులో బిఆర్ఎస్ బిజెపి అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నాంపల్లి శ్రీనివాస్ 399 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 25వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి వెన్నంపల్లి లావణ్య పై బిజెపి అభ్యర్థి కొండ ప్రశాంతి 201 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 26 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పుల్లూరు శ్రీకాంత్ పై బిఆర్ఎస్ అభ్యర్థి కేసిరెడ్డి లావణ్య 91 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 27వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి తాళ్లపల్లి రజిత పై కాంగ్రెస్ అభ్యర్థి కోయల్ కార్ భారతి 161 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 28వ వార్డులో బిజెపి అభ్యర్థి పంజాల రాధాస్వామి పై కాంగ్రెస్ అభ్యర్థి తాళ్లపల్లి రమేష్ 94 ఓట్ల తేడాతో గెలుపొందారు. 29వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి ముక్కా రమేష్ పై కాంగ్రెస్ అభ్యర్థి బోరగాల మొగిలి 30 ఓట్లతో విజయం సాధించారు. 30వ వార్డులో బిజెపి అభ్యర్థి ఎర్ర వసంత పై కాంగ్రెస్ అభ్యర్థి రొంటాల సుహాసిని 245 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *