ఒక్క అవకాశం ఇస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా… కాంగ్రెస్ పార్టీ 21 వ వార్డు అభ్యర్థి హరిబాబు

0

ఒక్క అవకాశం ఇస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా…

– కాంగ్రెస్ పార్టీ 21వ వార్డు అభ్యర్థి గుర్రం హరిబాబు
హుజురాబాద్:
కౌన్సిలర్ గా ఒక్క అవకాశం ఇస్తే 21 వ వార్డును అన్ని రకాల అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ 21 వ వార్డు అభ్యర్థి గుర్రం హరిబాబు స్పష్టం చేశారు. శనివారం వార్డులో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 21వ వార్డు అభివృద్ధి కోసం తనను ఆదరించి ఆశీర్వదిస్తే వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హరిబాబు పేర్కొన్నారు. వార్డులో ప్రజల మద్దతును పొందుతూ ముందుకు సాగుతున్నారు. నేరుగా ఓటర్ల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డులో మౌలిక సౌకర్యాల ఏర్పాటుతోపాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరం ఖాయమన్నారు. ప్రజా సంక్షేమ కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వార్డును అభివృద్ధి చేసి చూయిస్తానని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *